Site icon NTV Telugu

Virata Parvam: హమ్మయ్య.. ఎట్టకేలకు ‘విరాటపర్వం’ అప్డేట్ వచ్చేసింది

Virataparvam

Virataparvam

ఎన్ని సినిమాలు కరోనా సమయంలో వాయిదా పడ్డాయో అన్ని సినిమాలు విడుదల అయ్యి ప్రేక్షాదరణ పొందాయి. ఒక్క ‘విరాట పర్వం’ తప్ప..  రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి  అప్పుడెప్పుడో ఒక రిలీజ్ డేట్ ని ప్రకటించారు..   వెంటనే లాక్ డౌన్ స్టార్ట్ అయ్యింది. లాక్ డౌన్ తర్వాత మరో రిలీజ్ డేట్ ప్రకటించారు.. మరోసరి లాక్ డౌన్.. ఇక ఆ తరువాత ఈ సినిమా గురించిన ఒక అప్డేట్ ను మేకర్స్ ఇవ్వలేదు. దీంతో పలువురు పలు రకాలుగా అనుకోవడం మొదలుపెట్టారు. కొంతమంది ఓటిటీ లో వస్తుందని, ఇంకొంతమంది అసలు సినిమా రిలీజ్ కాదని కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.

ఇక ఎట్టకేలకు ఈ పుకార్లకు చెక్ పెట్టేశారు మేకర్స్.  ఈ సినిమా రిలీజ్ కి సంబంధించిన అప్డేట్ ను ఈరోజు సాయంత్రం 5 గంటలకు తెలపనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.  ఉత్తర తెలంగాణలో 1990 నేపథ్యంలో జరిగిన యదార్థ సంఘనల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ చిత్రంలో రానా.. నక్సలైట్ రవన్న గా కనిపించనుండగా, భారతక్క గా ప్రియమణి, రవన్న రచనలకు ఫిదా అయ్యి అతడికోసం అడవికి వెళ్లి ఇబ్బందులు పడిన యువతిగా సాయి పల్లవి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక అప్డేట్ విన్న రానా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హమ్మయ్య ఇప్పటికైనా మా ఆతృతను గుర్తించి అప్డేట్ ఇస్తున్నందుకు థాంక్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమా ఏ సినిమాకు పోటీగా రానుందో చూడాలి.

Exit mobile version