Site icon NTV Telugu

Rana: రజినీ సినిమాలో రానా… అనౌన్స్మెంట్ వచ్చేసింది

Rana

Rana

జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్… తన నెక్స్ట్ సినిమాని జై భీమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ తో చేయబోతున్నాడు. ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ సినిమా ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటూ ఉంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తుండడం విశేషం. ఇండియన్ సూపర్ స్టార్స్ అయిన అమితాబ్-రజినీకాంత్ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు అంటే ఆ మూవీ రేంజ్ ఎలా ఉండబోతుందో ఊహించొచ్చు. అయితే జ్ఞానవేల్ కాబట్టి రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమా కాకుండా కొత్త కథా కథనాలతో ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉంది. తలైవర్ 170 అనే వర్కింగ్ టైటిల్ తో లైకా ప్రొడక్షన్స్ నుంచి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. అనిరుధ్, మంజు వారియర్, రితిక సింగ్, దుషారా విజయన్ ల అప్డేట్స్ ఇచ్చిన మేకర్స్… లేటెస్ట్ గా మన భల్లాలదేవా రానా దగ్గుబాటి తలైవర్ 170 సినిమాలో నటిస్తున్నాడు అంటూ లైకా రివీల్ చేసింది.

నిజానికి ఈ ప్రాజెక్ట్ లో శర్వానంద్ నటిస్తున్నాడు అనే వార్త గత కొన్ని రోజులుగా వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు రానా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడంతో… శర్వా ప్లేస్ లో రానా వచ్చాడా లేక శర్వాతో పాటు రానా కూడా ఉన్నాడా అనేది చూడాలి. అమితాబ్-రజినీకాంత్ లకి విలన్ గా రానా నటిస్తున్నాడనే టాక్ కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉంది. ఇంటెన్స్ యాక్టింగ్ చేయడంలో రానా దిట్ట, డైలాగ్ డెలివరీలో కూడా ఆ ఇంపాక్ట్ కనిపిస్తది. అలాంటి రానా… అమితాబ్-రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్స్ కలిసి నటిస్తున్న పాన్ ఇండియా సినిమాలో విలన్ గా నటించే అవకాశం సొంతం చేసుకోవడం అంటే మాటలు కాదు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వనుందని, చెన్నైలో వేసిన భారీ సెట్ లో ఈ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని సమాచారం. ఈ సినిమాలో రజినీకాంత్ ఒక ఎంకౌంటర్ లో సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడట.

Exit mobile version