Site icon NTV Telugu

Rana Daggubati: ఇన్‌స్టా పోస్టులు డిలీట్.. రానా భార్య క్లారిటీ

Miheeka Clarity On Wedding

Miheeka Clarity On Wedding

Rana Daggubati Wife Miheeka Clarity On Those Rumours: సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే హీరోల్లో రానా దగ్గుబాటి ఒకరు. తన సినిమా అప్డేట్స్‌తో పాటు అప్పుడప్పుడు వ్యక్తిగత విషయాల్ని కూడా పంచుకుంటూ.. ఎల్లప్పుడూ నెట్టింట్లో చురుగ్గా ఉంటాడు. అలాంటి రానా.. ఉన్నట్లుండి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్టులన్నీ డిలీట్ చేయడం చర్చనీయాంశమైంది. అది కూడా తన రెండో వివాహ వార్షికోత్సవం సందర్భంగా పోస్టులు తొలగించడం, పలు అనుమానాలకు తావిచ్చింది. నిన్నటికి నిన్న.. సోషల్ మీడియా నుంచి విరామం తీసుకుంటున్నానని ట్విటర్‌లో పేర్కొన్నాడు. ఈరోజేమో ఇన్‌స్టా పోస్టులు మొత్తం తీసేశాడు. దీంతో.. రానా పర్సనల్ లైఫ్‌లో ఏమైనా తేడాలొచ్చాయా? భార్యాభర్తల (రానా – మిహీక) మధ్య విభేదాలు తలెత్తాయా? అని డిస్కస్ చేయడం మొదలుపెట్టారు.

అయితే.. అందులో ఏమాత్రం వాస్తవం లేదని మిహీక స్పష్టం చేసింది. నేరుగా స్పందించలేదు కానీ.. తమ అన్యోన్యమైన దాంపత్య జీవితాన్ని గుర్తు చేసుకుంటూ, ఇద్దరూ కలిసి దిగిన బ్యూటీఫుల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వెంకటేష్ పెద్ద కుమార్తెతో పాటు పలువురు ప్రముఖులు తమకు చేసిన శుభాకాంక్షల పోస్టులను సైతం ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసుకుంది. వీటిని బట్టి.. రానా, మిహీకల మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తలేదని స్పష్టం చేసుకోవచ్చు. అవన్నీ కేవలం రూమర్సేనని తీసిపారేయొచ్చు. అదంతా సరే గానీ.. రానా ఎందుకు సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకున్నట్టు? బహుశా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల.. సోషల్ మీడియా ఖాతాల్ని హ్యాండిల్ చేయలేక, ఇలా బ్రేక్ ఇచ్చినట్టు ఉంది. ఆ పోస్టులో కూడా రానా బిగ్ స్క్రీన్ మీదే చూద్దామని పేర్కొనడం గమనార్హం.

కాగా.. రానా దగ్గుబాటి కరోనా పాండమిక్ సమయంలో ఓ ఇంటివాడయ్యాడు. 2020 ఆగష్టు 8వ తేదీన తన ప్రేయసి మిహీకా బజాజ్‌ని వివాహం చేసుకున్నాడు. లాక్‌డౌన్ సమయం కావడంతో.. ఇరు కుటుంబ సభ్యులు, అతి కొద్దిమంది అతిథుల మధ్యే వీరి వివాహం జరిగింది. తెలుగు, మరాఠీ సంప్రదాయ పద్ధతుల్లో వీరు పెళ్లి చేసుకున్నారు. ఈరోజు వెడ్డింగ్ డే కావడంతో ఆ ఇద్దరికీ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Exit mobile version