Site icon NTV Telugu

Jai Balayya: జై బాలయ్య అంటూ ఊగిపోయిన రానా

Jai Balayya

Jai Balayya

Rana Daggubati Vibing to Jai Balayya Song : ఈ మధ్యకాలంలో జై బాలయ్య అనే నినాదం బాగా పాపులర్ అయింది. హైదరాబాద్ పబ్బులలో కూడా చివరి పాటగా బాలకృష్ణ పాటలు ప్లే చేసేంతగా ఆయన ఇమేజ్ మారిపోయింది. తాజాగా ఒక స్టార్ హీరో జై బాలయ్య సాంగ్ కి వైబ్ అవుతూ కాలు కదిపిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ హీరో ఇంకెవరో కాదు రానా దగ్గుబాటి. బాహుబలి సినిమాతో సూపర్ క్రేజ్ అందుకున్న రానా తర్వాత అనారోగ్య కారణాలతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయినా సరే ప్రొడక్షన్ విషయంలో మాత్రం దూసుకుపోతున్నారు. ఆయన ఎప్పుడూ సైమా అవార్డుల వేడుకకు హోస్ట్ చేస్తూ వస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Nita Ambani: కన్నీళ్లు తెప్పించిన నీతా అంబానీ స్పీచ్.. ఒక్కసారి ఉద్వేగంగా మారిన పెళ్లి వేదిక

అయితే ఈసారి కాస్త రూట్ మార్చి ఐఫా అవార్డులకు ఆయన పోస్ట్ చేయడానికి రెడీ అయ్యారు. యువ హీరో తేజ సజ్జాతో కలిసి ఆయన ఐఫా అవార్డుల వేడుకను హౌస్ట్ చేయబోతున్నారు. సెప్టెంబర్ 6, 7 తేదీలలో అబుదాబిలో జరగబోతున్న ఈవెంట్ కి సంబంధించిన కర్టెన్ రైజర్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్ నో హోటల్ లో గ్రాండ్గా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన రానా దగ్గుబాటి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో జై బాలయ్య సాంగ్ వినిపించింది. దీంతో రానా ఆ సాంగ్ కి కాలు కదుపుతూ కనిపించాడు. చివరిలో జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ మీడియాకు హాట్ టాపిక్ అయ్యాడు.

Exit mobile version