NTV Telugu Site icon

Ram Gopal Varma: భార్యల నుంచి భర్తలు స్వాతంత్య్రం పొందినప్పుడే నిజమైన స్వాతంత్య్రం

Varma

Varma

Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పండగ ఏదైనా తనదైన స్టైల్లో అభిమానులకు విషెస్ చెప్తూ ఉంటాడు. తాజాగా నేడు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా స్వాతంత్య్రానికి కొత్త నిర్వచనం చెప్పుకొచ్చాడు. సాధారణంగా ఇండిపెండెన్స్ డే ని ఎందుకు జరుపుకుంటాం.. దేశం నుంచి బ్రిటిష్ వారు వెళ్లిపోవడంతో మనకు ఫ్రీడమ్ దక్కిందని, ఆ ఫ్రీడమ్ కోసం పొడిన యోధులను గుర్తుచేసుకుంటూ ఉంటాం. ఆగస్టు 15 అంటే ఎవ్వరైనా ఇదే నిర్వచనం ఇస్తారు.. అయితే వర్మ దృష్టిలో స్వాతంత్య్రం అంటే వేరు అని చెప్పుకొచ్చాడు.

” నిజమైన స్వాతంత్య్రం అంటే భార్యల నుంచి భర్తలు స్వాతంత్య్రం పొందడం.. బోరింగ్ భర్తల నుంచి భార్యలు స్వాతంత్య్రం పొందడం.. చికాకు కలిగించే తల్లిదండ్రుల నుండి పిల్లలు స్వాతంత్య్రం పొందడమే” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ట్వీట్ పై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. కొంతమంది వర్మ చెప్పింది నిజమే అంటుంటే.. ఇంకొంతమంది నీకు తప్ప ఇంకెవ్వరికి ఈరోజు పండగ జరుపుకొనే హక్కు లేదు అంటూ చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా వర్మ అన్నదాంట్లో తప్పులేదని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఇక ప్రస్తుతం వర్మ పలు ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు.