Site icon NTV Telugu

వర్మ డ్యాన్సింగ్ స్కిల్స్ కి నెటిజన్స్ ఫిదా

దర్శకుడు రాంగోపాల్ వర్మకు వోడ్కా, అమ్మాయి అంటే ఎంత ఆరాధనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ టైమ్ లో సొసైటీ గూర్చి ఆయన అస్సలు పట్టించుకోడు. పైగా ఎవరైనా ఏంటి? ఎందుకు ? అనే ప్రశ్నలు వేస్తే తన ఫీలాసఫీ, లాజికల్ సమాధానాలతో మెప్పిస్తాడు. ఇకపోతే వర్మ ఓ అమ్మాయితో డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మత్తులో ఉన్న వర్మ అమ్మాయితో కలిసి మైమరిచి డాన్స్ చేస్తున్నారు. ఆ వీడియోలో సదరు అమ్మాయిని ముద్దులు, హగ్గులతో ముంచెత్తున్న వర్మ, ఆమె కాళ్లకు దండం పెట్టాడు. ఈ వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వర్మ డ్యాన్సింగ్ స్కిల్స్ కి నెటిజన్స్ ఫిదా అయ్యారు. ‘బ్రతుకంటే.. నీదే రాజా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఆ వీడియోలో అమ్మాయితో డాన్స్ చేస్తున్నది తాను కాదంటూ వర్మ ట్వీట్ చేశాడు. బాలాజీ, గణపతి, జీసస్ వంటి దేవుళ్లపై ఒట్టు, ప్రమాణ పూర్తిగా ఆ వీడియోలో ఉన్నది నేను కాదు, అంటూ ట్వీట్ చేశారు. గతంలో హీరోయిన్ ఛార్మితో వర్మ ఇదే తరహాలో డాన్స్ చేస్తూ కనిపించిన విషయం తెలిసిందే.

Exit mobile version