Site icon NTV Telugu

Ram Gopal Varma: రణవీర్ న్యూడ్ ఫోటోషూట్.. అమ్మాయిలు ఎక్కువ ఆనందిస్తారన్న వర్మ

Varma

Varma

Ram Gopal Varma: బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్ వివాదం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఒక మ్యాగజైన్ కోసం ఈ హీరో ఒంటిపై నూలుపోగు లేకుండా కెమెరాకు పోజులిచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం విదితమే. ఇక ఒక ఎన్జీవో సంస్థ రణవీర్ పై కేసు కూడా నమోదు చేసింది. మహిళల మనోభావాలను దెబ్బతీసేలా రణవీర్ ఫోటోషూట్ చేశాడని, వెంటనే ఆ ఫోటోలను డిలీట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక మరోపక్క పలువురు ప్రముఖులు ఈ ఫోటోషూట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక తాజాగా వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం రణవీర్ ను ప్రశంసలతో ముంచెత్తడంతో పాటు తనకు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశాడు.

“నేను వ్యక్తిగతంగా రణవీర్ సింగ్ ను అభినందిస్తున్నాను. చాలామంది అతడిని అభినందించడం చూసి నేను కూడా థ్రిల్ అయ్యాను. రణవీర్ సింగ్ కొత్త యుగం బోల్డ్ నెస్. ఇలాగే మహిళలు చేస్తే ప్రశంసించాలి.. మగవారు చేస్తే ప్రశంసించకూడదా..? లింగ సమానత్వం ఉండాలి. మహిళలతో సమానంగా మగవారికి హక్కులు ఉన్నాయి. ఇక్కడ ఒక ప్రశ్న.. పురుషులు స్త్రీల నగ్న చిత్రాలను చూసి పొందే ఆనందం కంటే.. స్రీలు, పురుషుల నగ్న చిత్రాలను చూసి పొందే ఆనందం ఎక్కువ..? నిజమా కాదా అంటూ ఒక పోల్ కూడా పెట్టుకొచ్చాడు. ప్రస్తుతం వర్మ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇప్పటివరకు రణవీర్ నే ఏకిపారేస్తున్న నెటిజన్స్ ఇప్పుడు వర్మను కూడా కలిపి దుమ్మెత్తిపోతున్నారు.

Ram Gopal Varma Latest Tweet:

Exit mobile version