Site icon NTV Telugu

Ram Charan: పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం ఊహించని కాంబినేషన్ సెట్…

Ram Charan

Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ప్రొడ్యూసర్ విక్రమ్ కలిసి కొత్త ప్రొడక్షన్ హౌజ్ ని స్టార్ట్ చేసారు. ‘ మెగా వీ పిక్చర్స్’ అనే బ్యానర్ ని క్రియేట్ చేసి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసారు. యంగ్ టాలెంట్ తో అండ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ని బాలన్స్ చేస్తూ సినిమాలు చెయ్యాలనేది చరణ్, విక్రమ్ ల ఆలోచన. ఈ ఆలోచనకి ఇప్పటికే పాన్ ఇండియా మార్కెట్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న అభిషేక్ అగర్వాల్ కూడా కలిసాడు. ఇప్పటికే కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 సినిమాలతో పాన్ ఇండియా హిట్స్ అందుకున్న అభిషేక్ అగర్వాల్, త్వరలో ‘వ్యాక్సిన్ వార్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడం విశేషం. చరణ్, విక్రమ్ లకి అభిషేక్ అగర్వాల్ కలవడం… ఈ బ్యానర్ సినిమాలు రావడం ట్రేడ్ కి హెల్ప్ అవుతుంది. ఈ క్రేజీ కాంబినేషన్ ని అనౌన్స్ చేస్తూ అభిషేక్ అగర్వాల్, మంచి కథలకి బ్యాంకింగ్ ఇస్తాం అంటూ ట్వీట్ చేసాడు.

రేపు ఉదయం 11:11 నిమిషాలకి ‘వీ మెగా పిక్చర్స్’, ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ కలిసి ప్రొడ్యూస్ చేయనున్న ఫస్ట్ మూవీని గ్రాండ్ గా అనౌన్స్ చెయ్యనున్నారు. ఈ కాంబినేషన్ లో ఎలాంటి సినిమా అనౌన్స్ అవ్వనుందా అని సినీ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాయి. అయితే ‘వీ మెగా పిక్చర్స్’ ప్రొడ్యూస్ చెయ్యబోయే మొదటి సినిమాలో అక్కినేని అఖిల్ హీరోగా ఉంటాడు అనే టాక్ గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అఖిల్ కి చరణ్ కి మధ్య చాలా మంచి స్నేహం ఉంది, ప్రస్తుతం అఖిల్ కెరీర్ రిస్క్ లో ఉంది. ఇలాంటి సమయంలో అఖిల్ ని నిలబెట్టడానికి చరణ్ ఒక సినిమా చేస్తున్నాడు అనే మాట వినిపిస్తోంది. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలి అంటే రేపు ఉదయం వరకూ ఆగాల్సిందే.

Exit mobile version