Site icon NTV Telugu

Rakul and Jackky Bhagnani : తాజ్ మహల్ సందర్శనలో లవ్ బర్డ్స్

Rakul

పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కొంతకాలం క్రితం తన ప్రియుడిని పరిచయం చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానిని ప్రేమిస్తున్నట్టు వెల్లడించింది. ఇక ఆ తరువాత రకుల్ పెళ్ళి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా, నా పెళ్లి విషయం నేనే ప్రకటిస్తాను అంటూ ఫైర్ అయ్యింది. దీంతో ఆ రూమర్స్ కు చెక్ పడింది. తాజాగా ఈ లవ్ బర్డ్స్ ప్రపంచ వింతలలో ఒకటైన, ప్రేమకు ప్రతిరూపమైన పాలరాతి కట్టడం తాజ్ మహల్ ను సందర్శించారు. ఆ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “దే దే ప్యార్ దే” దర్శకుడు లవ్ రంజన్ వివాహానికి హాజరు కావడానికి ఈ జంట ఆగ్రాకు వెళ్లినట్టు తెలుస్తోంది.

Read Also : Rana Daggubati : అర్జున్ ప్రసాద్ నుంచి డేనియల్ శేఖర్… 12 ఏళ్ళు

ఇక రకుల్ సినిమాల విషయానికొస్తే… 2022లో ఆమె నటించిన వరుస సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రకుల్.. అజయ్ దేవగన్‌తో “రన్‌వే 34”, ఆయుష్మాన్ ఖురానాతో కలిసి “డాక్టర్ G”, జాన్ అబ్రహం, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లతో కలిసి ‘అటాక్’ అనే సినిమాలు చేసింది. ఇక రకుల్ సోలో లీడ్ ఫిల్మ్ ‘ఛత్రివాలి’ కూడా విడుదలకు సిద్ధమవుతోంది.

Exit mobile version