NTV Telugu Site icon

Rakshit Shetty: మొదటి రోజే బ్రేక్ ఈవెన్… ఆల్ షోస్ హౌజ్ ఫుల్

Rakshit Shetty Side A

Rakshit Shetty Side A

కన్నడ యంగ్ స్టార్ హీరో రక్షిత్ శెట్టి అతడే శ్రీమన్నారాయణ, 777 చార్లీ సినిమాలతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. క్వాలిటీ ఉండే సినిమాలని, కంటెంట్ ఓరియెంటెడ్ కథలకి మాత్రమే ఓకే చెప్పే రక్షిత్ శెట్టి… లేటెస్ట్ గా నటిస్తూ ప్రొడ్యూస్ చేసిన సినిమా ‘సప్త సాగర దాచే ఎల్లో’ కర్ణాటకలో సూపర్ హిట్ అయ్యింది. రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 1న కన్నడ ఆడియన్స్ ముందుకి వచ్చి క్లాసిక్ లవ్ స్టోరీ అనే పేరు తెచ్చుకుంది. ఈ మూవీలో మను అండ్ ప్రియాల ప్రేమకథని దర్శకుడు హేమంత్ రావు బ్యూటిఫుల్ గా నరేట్ చేసాడు.

చరణ్ రాజ్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచిన ‘సప్త సాగర దాచే ఎల్లో’ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగులో రిలీజ్ చేసింది. ‘సప్త సాగర దాచే ఎల్లో’ రైట్స్ ని తీసుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈరోజు ఈ మూవీని తెలుగులో ‘సప్త సాగరాలు దాటి’గా రిలీజ్ చేసారు. సెప్టెంబర్ 22న రిలీజ్ ఈ సినిమా… మొదటి రోజే బ్రేక్ ఈవెన్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. రిలీజ్ కి ముందు మంచి బజ్ జనరేట్ చేసిన సప్త సాగరాలు దాటి పోస్ట్ రిలీజ్ కలెక్షన్స్ లో ఆ ఇంపాక్ట్ చూపిస్తుంది. అన్ని సెంటర్స్ లో ఈ సినిమాకి హౌజ్ ఫుల్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఒక మంచి సినిమా వస్తే తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తారు అనే విషయాన్నీ సప్త సాగరాలు దాటి సినిమా మరోసారి ప్రూవ్ చేస్తుంది. అన్ని సెంటర్స్ లో థియేటర్స్ ఫుల్ అవుతూ ఉండడంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ థియేటర్స్ ను పెంచే పనిలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 25కి పైగా థియేటర్స్ పెరిగాయి కాబట్టి కలెక్షన్స్ కూడా పెరగనున్నాయి.

Show comments