Site icon NTV Telugu

Raju Gari Kodi Pulao: ఆకట్టుకుంటున్న “రాజుగారి కోడిపులావ్” ట్రైలర్

Raju Gari Kodi Pulao

Raju Gari Kodi Pulao

ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం “రాజు గారి కోడిపులావ్” కుటుంబ కథా ‘వి’చిత్రం అనేది ట్యాగ్. శివ కోన, ఈటీవీ ప్రభాకర్, నేహా దేశ్ పాండే, కునాల్ కౌశల్, ప్రాచీ కెథర్, రమ్య దేష్, అభిలాష్ బండారి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు శివ కోన దర్శకత్వం వహిస్తున్నారు. రాజుగారి కోడిపులావ్ చిత్రం నుంచి విడుదలైన పాటలు, వీడియోలు మూవీ లవర్స్ అందరి దృష్టిని విపరీతంగా ఆకట్టుకొన్నాయి. ‘రాజు గారి కోడిపులావ్’ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ ముగించుకుని జూలై 29న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలకు ముస్తాబు అవుతున్న సందర్భంగా అందరూ ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న భారీ అప్డేట్ ట్రైలర్ రూపంలో మన ముందుకు వచ్చింది.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో చేతిలో చికెన్ ముక్క పట్టుకొని ఓ పాప అడవిలో ఎంట్రీతో ట్రైలర్ మొదలవుతుంది. రాజు గారి కోడి పులావ్ తో ఎంతో ఫేమస్ అయినా ఈ టీవీ ప్రభాకర్ ఈ ట్రైలర్లో తన కుటుంబ నేపథ్యాన్ని చెబుతుంటాడు. అదే సమయంలో కొంతమంది స్నేహితులు రోడ్ ట్రిప్ ప్లాన్ వేసుకొని ఒక అడవిలోకి ఎంటర్ అవుతారు. కారు సడన్గా బ్రేక్ డౌన్ అవుతుంది దాంతో వాళ్లు అడవిలోకి కాలినడకన వెళ్తారు. అక్కడినుండి కథలో మెయిన్ కాంప్లెక్ట్ మొదలు అవుతుందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక ట్రైలర్లో ఎన్నో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు ఇంకెన్నో సస్పెన్స్ అంశాలు ఉన్నాయని అర్థమవుతుంది. ఇక ట్రైలర్లో పోలీసులు, అఘోరాలు, జోకర్ గెటప్ లో ఉన్న వ్యక్తితో పాటు ఒక ముఠా ఉన్నారు. వీరికి కథకి ఉన్న సంబంధం ఏంటో అన్న ఆసక్తి ట్రైలర్ చూసిన అందరిలో ఉంది. యూత్ ఫుల్ సస్పెన్స్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన రాజు గారి కోడి పులావ్ సినిమా ఈ తరానికి కావలసిన అన్ని అంశాలతో పాటు చాలా ఇంటెన్స్ కథ ఉన్నట్లు కనిపిస్తోంది.

Exit mobile version