Site icon NTV Telugu

Pawan Sadineni: ‘మాన్ స్టర్’గా రాజశేఖర్!

Raja Shekar

Raja Shekar

 

Rajasekhar as a monster!

డా. రాజశేఖర్ కథానాయకుడిగా, పవన్ సాదినేని దర్శకత్వంలో మల్కాపురం శివ కుమార్ ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ను తెరకెక్కిస్తున్నారు. దీనికి ‘మాన్‌స్టర్‌’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా ప్రారంభోత్సవం మంగళవారం జరిగింది. రాజశేఖర్ కోసం పవన్ సాదినేని పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశారని, తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులు, గ్యాంగ్‌స్టర్ల మధ్య ఇరుక్కున్న ‘మాన్ స్టర్’ కథ ఇదని నిర్మాత శివకుమార్ తెలిపారు. చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా హీరో రాజశేఖర్, బెక్కెం వేణు గోపాల్, శివకుమార్‌ తో కలిసి దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు. నిర్మాతలు దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్ కలిసి కెమెరా స్విచాన్ చేయగా, ప్రవీణ్ సత్తారు క్లాప్ ఇచ్చారు. ప్రశాంత్ వర్మ ఫస్ట్ షాట్‌కి గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ చిత్రానికి ఎమ్ జిబ్రాన్ సంగీతాన్ని, వివేక్ కాలేపు సినిమాటోగ్రఫీనీ అందిస్తున్నారు. విప్లవ్ నైషధం ఎడిటర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి రాకేందు మౌళి డైలాగ్స్ అందిస్తున్నారు. హుస్సేన్ ష కిరణ్, వసంత్ జుర్రు అదనపు స్క్రీన్ ప్లేని అందించారు. శ్రీనివాస్ నారిని ప్రొడక్షన్ డిజైనర్. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తామని నిర్మాత శివకుమార్ చెప్పారు.

Exit mobile version