“రాజా సాబ్” సక్సెస్ హ్యాపీనెస్ ను ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూ లో షేర్ చేసుకున్నారు డైరెక్టర్ మారుతి. ప్రభాస్ గారి అభిమానులు నాకు సోదరులు. వారే ఫోన్స్ , మెసేజ్ లు చేస్తూ అభినందిస్తున్నారు. ప్రభాస్ గారిని కలర్ ఫుల్ గా సాంగ్స్, డ్యాన్స్ లతో చూపించారని, కొత్తగా ప్రెజెంట్ చేశారని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది నాకు పర్సనల్ గా విష్ చేశారు. నాగ్ అశ్విన్ గారు, సందీప్ వంగా గారు రాజా సాబ్ కు సపోర్ట్ చేశారు. సంక్రాంతి మూడ్ లో ఉంటారు కాబట్టి ప్రేక్షకులు అలాంటి ఒక లైటర్ వేన్ సినిమా ఎక్స్ పెక్ట్ చేసి ఉంటారు. ఈ కథలో బొమన్ ఇరానీ పాత్ర ఎంటరైనప్పటి నుంచి సైకలాజికల్ గా టర్న్ అవుతుంది.
Also Read :Maruthi: నలుగురు చెడుగా మాట్లాడితే నలభై మంది వెళ్లి సినిమా చూస్తున్నారు.
ఆ సీన్స్ వెనక మేము అనుకున్న కాన్సెప్ట్ కొందరికి సులువుగా అర్థం కాకపోయి ఉండొచ్చు. హారర్ మూవీస్ లో దెయ్యాన్ని చంపడం ఈజీ. ఎలాగైనా చంపొచ్చు. కానీ ప్రభాస్ గారి లాంటి పాన్ ఇండియా హీరోతో ఒక క్యారెక్టర్ డిజైన్ చేసి సాదా సీదా హారర్ కామెడీ చేయొద్దనే ఇలా ఫాంటసీ, సైకలాజికల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి బిగ్ స్కేల్ మూవీ చేశాం. సినిమా రిలీజైన సెకండ్ డే ప్రెస్ మీట్ లో నేను మా మూవీకి ఎలాంటి రెస్పాన్స్ ఉంది, ఎవరు ఎలా అనుకుంటున్నారు అనేది క్లియర్ గా చెప్పా. ఈ సోషల్ మీడియా ట్రెండ్ లో ఎందుకు దాచడం, ఇప్పుడు రాజా సాబ్ మూవీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా బాగుందంటూ వాళ్లే మెసేజ్ లు పంపుతున్నారు అన్నారు మారుతి.
