NTV Telugu Site icon

Raghava Reddy : ఆకట్టుకుంటోన్న ‘రాఘవ రెడ్డి’ ట్రైలర్

Raghavareddy Trailer

Raghavareddy Trailer

Raghava Reddy Movie Trailer Released: శివ కంఠమనేని, రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రధారులుగా ‘రాఘవ రెడ్డి’ అనే సినిమా తెరకెక్కింది. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్‌పై సంజీవ్ మేగోటి దర్శకత్వంలో K.S. శంకర్ రావ్, G. రాంబాబు యాదవ్, R. వెంకటేశ్వర్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం మేకర్స్ విడుదల చేయగా ఈ ట్రైలర్‌ను గమనిస్తే.. పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఫార్మేట్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిందని అర్ధం అవుతోంది. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన హీరో తప్పులను సహించని వ్యక్తిత్వం కారణంగా మంచి పేరు తెచ్చుకుంటాడు.

Sree Leela: సినిమానే ముఖ్యం.. పరీక్షలకు డుమ్మా కొట్టిన శ్రీలీల!

అయితే వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి, అయితే ఆ సమస్యలేంటి? నిజాయితీగా ఉండటం వల్ల తను ఏం పోగొట్టుకున్నాడు? డ్యూటీలో తనెంత సిన్సియర్‌గా ఉంటాడు? విలన్స్‌ని హీరో ఎలా కట్టడి చేశాడు లాంటి అంశాలతో రాఘవరెడ్డి సినిమాను తెరకెక్కించారని అర్థమవుతుంది. శివ కంఠమనేని, రాశి, నందితా శ్వేత, పోసాని, అజయ్ ఘోష్, అజయ్, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి వంటి స్టార్స్ నటించిన ఈ సినిమాకి సంజీవ్ మేగోటి – సుధాకర్ మారియో సంగీత సారథ్యం వహించగా ఎస్.ఎన్.హరీష్ సినిమాటోగ్రఫీ అందించారు. కె.వి.రమణ ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన ఈ సినిమాను జనవరిలో రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అజయ్, పోసాని కృష్ణమురళి, ప్రవీణ్ , అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి, BHEL ప్రసాద్, మీనా వాసు, విజయ్ భాస్కర్, తేలు రాధాకృష్ణ, రాఘవరెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

Show comments