Site icon NTV Telugu

Radha Madhavam: మార్చి 1న ‘రాధా మాధవం’.. ఆశీర్వదించాలన్న సినిమా యూనిట్

Radha Madhavam Movie

Radha Madhavam Movie

Radha Madhavam Movie Unit Press Meet: వినాయక్ దేశాయ్, అపర్ణ దేవి హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మించిన ‘రాధా మాధవం’ మార్చి 1న విడుదల కాబోతోంది. . ఈ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించగా వసంత్ వెంకట్ బాలా కథ, మాటలు, పాటలు అందించారు. ఇప్పటికే రాధా మాధవం సాంగ్, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీసినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేయగా ప్రమోషన్స్ లో భాగంగా సినిమ యూనిట్ మీడియా ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు దాసరి ఇస్సాకు మాట్లాడుతూ.. ‘కథ విన్న వెంటనే నాకు చాలా నచ్చింది, మా రైటర్ అద్భుతంగా కథను రాశారు, రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ కథను రాశారని అన్నారు.

Manjummel Boys Review: మంజుమ్మేల్ బాయ్స్(మలయాళం) రివ్యూ

కథ విన్న తరువాత నాకు వినాయక్ గుర్తొచ్చాడు, ఆయన హైట్‌కు తగ్గ హీరోయిన్‌ను వెతికాం. చివరకు అపర్ణ దేవి కనిపించారు, ఆమె చక్కగా నటించారని అన్నారు. హీరో వినాయక్ దేశాయ్ మాట్లాడుతూ.. ‘మా నిర్మాత వెంకటేష్ సహకరించడం వల్లే ఈ సినిమా ఈ స్థాయి వరకు వచ్చింది. కొత్త హీరో అని చూడకుండా నాపై నమ్మకంతో ఈ సినిమా నిర్మించారన్నారు. రాధా మాధవం అందమైన ఓ ప్రేమ కథా చిత్రం, యాక్షన్ సీక్వెన్స్ ఎంతో సహజంగా ఉంటాయి. హీరోయిన్ మలయాళీ అమ్మాయి. పైగా క్లాసికల్ డాన్సర్, అలాంటి అమ్మాయితో నటించడం ఆనందంగా ఉంది. ప్రేక్షకులంతా మా సినిమాను చూసి సక్సెస్ చేయాలని అన్నారు. హీరోయిన్ అపర్ణా దేవి మాట్లాడుతూ.. ‘ నాకు తెలుగు అంతగా రాదు, ఈ సినిమాలో లెంగ్తీ డైలాగ్స్ ఉన్నాయి. హీరో వినాయక్ ఎంతో సపోర్ట్ చేశారు, నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. మార్చి 1న ఈ చిత్రం రాబోతోంది. అందరూ మా సినిమాను ఆశీర్వదించండని అన్నారు.

Exit mobile version