లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా. టీం చెప్పకుండానే ధర్మన్ మూవీలో రామ్ నటిస్తున్నాడన్న రివీల్ చేసేసింది. రామ్ అండ్ రజనీకాంత్‌తో వర్కౌట్ చేసినట్లు ఓ పిక్ పంచుకుంది. టీం అబ్జక్ట్ చేసిందో లేక… షూటింగ్ అప్డేట్ ఇవ్వాలనుకుందో.. తన ఇంటెన్షన్ ఏదైనా మిస్టేక్ త్వరగానే గ్రహించి డిలీట్ చేసేసింది. కానీ అప్పటికే జరగాల్సినదంతా జరిగిపోయింది. ఆ ఫోటోలు వైరల్ అయి.. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ధర్మన్‌లో తలైవర్‌తో రామ్ నటిస్తున్నాడన్న రూమర్స్ నిజం చేసినట్లయ్యింది రాశీ.
ధర్మన్ మూవీలో రామ్ పోతినేని విలన్‌గా కనిపించబోతున్నాడని టాక్. కమల్ హాసన్ నిర్మిస్తోన్న ఈ మూవీలో రజనీకాంత్ అండ్ రామ్ మామా అల్లుళ్లుగా నటిస్తున్నారట. ఇప్పటి వరకు బైలింగ్వల్ మూవీతో కోలీవుడ్ ఆడియన్స్‌కు పరిచమైన రామ్.. ధర్మన్ మూవీతో ఫస్ట్ టైం విలన్ రోల్ చేయబోతున్నాడు. రాశీ ఖన్నాకు జోడీగా రామ్ నటిస్తున్నాడని చెన్నై బజ్. గతంలో ఈ ఇద్దరి కాంబోలో శివం అండ్ హైపర్ చిత్రాలొచ్చాయి. ఈ రెండు కూడా బాక్సాఫీస్ దగ్గర బెడిసికొట్టాయి. ఇప్పుడు కోలీవుడ్ మూవీ కోసం జతకట్టబోతోంది. ప్రస్తుతం ధర్మన్ ధర్డ్ షెడ్యూల్ మైసూర్‌లో జరుగుతోంది. ఇక్కడ దిగిన పిక్సే షేర్ చేసింది రాశీ. టాలీవుడ్ మార్కెట్ గ్రాబ్ చేసేందుకు కోలీవుడ్ దర్శకులు…రజనీ సినిమా కోసం తెలుగు స్టార్ హీరోలను విలన్స్ చేస్తున్నారు. వెట్టయాన్‌లో తలైవర్‌తో తలపడ్డాడు రానా. టీ.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో రానా క్యారెక్టర్ తేలిపోయింది. లోకేశ్ కనగరాజ్ కూలీ కోసం నాగార్జునను తీసుకెళ్లాడు. నాగ్‌ను విలన్‌గా చూడటం కోలీవుడ్ ఆడియన్స్ కూడా తట్టుకోలేకపోయారు. రానా అండ్ కింగ్‌ను సరిగ్గా వినియోగించుకోవడంలో తడబడ్డారు కోలీవుడ్ మేకర్స్. ధర్మన్‌లో దర్శకుడు అశ్వత్ మారిముత్తు రామ్ పోతినేనిని కరెక్ట్‌గా ప్రజెంట్ చేస్తాడా .. లేక వెట్టయాన్, కూలీ జాబితాలో ఈ సినిమాను కూడా చేరుస్తాడా..? చూడాలి..

