రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రలో వచ్చిన ‘జనతా బార్’కి రమణ మొగిలి దర్శక, నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ సినిమా గత ఏడాది చివర్లో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. తెలుగు, తమిళంలో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ ఇప్పుడు కన్నడ ఆడియెన్స్‌ను మెప్పిస్తోంది. ఇక త్వరలోనే ఈ మూవీని కేరళ, హిందీ ఆడియెన్స్‌ను అలరించేందుకు సిద్దం అవుతోంది. అన్ని భాషల్లో థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసుకున్న తరువాత ఓటీటీ ప్రేక్షకుల ముందుకు చిత్రం రానుంది.
Also Read:Shocking: HR మేనేజర్ తల నరికి, ముక్కలు చేసి హత్య.. ప్రియుడి పైశాచికం..
స్పోర్ట్స్, రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో అమీక్షా పవర్, అమన్ ప్రీత్ సింగ్, దీక్షా పంత్, శక్తి కపూర్, అనూప్ సోనీ, ప్రదీప్ రావత్, సురేష్, భూపాల్, విజయ్ భాస్కర్, గోవర్ధన్, “మిర్చి” మాధవి, రమ్య తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇక క్రీడల్లో మహిళలపై జరిగే వేధింపులు, ఎదురయ్యే చేదు అనుభవాల చుట్టూ ఈ కథను అల్లారు. తన సోదరికి జరిగిన అన్యాయాన్ని బయట పెట్టి, ప్రతీకారం తీర్చుకునే రివేంజ్ డ్రామాగా ఈ ‘జనతా బార్’ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. అశోక్ రాజా, సుచిత్ర చంద్రబోష్, అజయ్ సాయి ఈ సినిమాలోని పాటలకు కొరియోగ్రఫీ చేశారు. డ్రాగన్ ప్రకాష్ ఈ మూవీలోని ఫైట్స్ కంపోజ్ చేశారు.
