Pushpa The Rule interval Scene: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సెకండ్ పార్ట్ తెరకెక్కుతోంది. పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగాన్ని అంతకుమించిన హిట్ చేయాలని సినిమా యూనిట్ భావిస్తోంది. దానికి తోడు పుష్ప మొదటి భాగం రిలీజ్ అయిన తర్వాత సౌత్ నుంచి నార్త్ కు వెళ్లి అనేక సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. పుష్ప మొదటి భాగం కూడా నార్త్ లో బాగా పర్ఫార్మ్ చేసిన నేపథ్యంలో రెండో భాగం మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు సుకుమార్ అండ్ టీం. ఇక యానిమల్ సినిమా వచ్చిన తర్వాత పుష్ప 2 సినిమాకి అనేక మార్పులు చేర్పులు కూడా సుకుమార్ చేస్తున్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా అనుసరణ సమాచారం మేరకు పుష్ప 2 ఇంటర్వెల్ బ్లాక్ ని ఒక రేంజ్ లో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
Fighter Ban: విడుదలకు ముందు షాక్.. అక్కడ ఫైటర్ సినిమా బ్యాన్!
ఇక ఈ మేరకు ఇంటర్వెల్ బ్లాక్ సీన్ ఎలా ఉంటుంది అనేది లీక్ అయింది. ఆ లీక్ అయిన సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అవుతుంది. లీకైన సమాచారం మేరకు పుష్ప రాజు ఎర్రచందనం ట్రాన్స్పోర్టేషన్ గురించి చర్చించడానికి జపాన్ కి చెందిన ఒక డాన్ తో డీల్ కుదుర్చుకోవడానికి వెళ్తాడు. అప్పుడు అక్కడ లోకల్ గ్యాంగ్ తో ఒక పెద్ద వైలెంట్ ఫైట్ జరుగుతుందని చెబుతున్నారు. ఎలా అయితే యానిమల్ ఇంటర్వెల్ బ్లాకులో ఒక భారీ ఫైట్ ఉంటుందో అంతకు మించిన ఫైట్ ఒకటి డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక సినిమాలో అది మాత్రమే కాకుండా అల్లు అర్జున్ చీర ధరించిన జాతర ఫైట్ కూడా ఒక రేంజ్ లో ఉంటుందని అలాగే మరిన్ని అద్భుతమైన యాక్షన్ సీక్రెన్సులు కూడా డిజైన్ చేశారని తెలుస్తోంది.
