2021 సంవత్సరంలో ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన సినిమా ‘పుష్ప ది రైజ్’. స్టైలిష్ స్టార్ గా సౌత్ ఇండియాకి పరిచయం ఉన్న అల్లు అర్జున్ ని, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మార్చి పాన్ ఇండియా ఆడియన్స్ కి పరిచయం చేసింది ‘పుష్ప ది రైజ్’ సినిమా. సుకుమార్ డైరెక్షన్ చేసిన ఈ మూవీలో అల్లు అర్జున్ నెవర్ బిఫోర్ యాక్టింగ్ చేశాడు. పాన్ ఇండియా హిట్ అయిన పుష్ప ది రైజ్ సినిమా ఏడాదిన్నర అవుతున్నా రికార్డులు బ్రేక్ చేస్తూనే ఉంది. ఇండియాలో దాదాపు 450 కోట్ల గ్రాస్ ని రాబట్టిన పుష్ప ది రైజ్ సినిమా ఇటివలే రష్యాలో కూడా రిలీజ్ అయ్యింది. రిలీజ్ ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ కూడా రష్యా వెళ్లి ప్రెస్ మీట్స్, ఆడియన్స్ మీట్లలో పాల్గొన్నారు.
అల్లు అర్జున్, రష్మిక, సుకుమార్ స్వయంగా రష్యా వెళ్లి చేసిన ప్రమోషన్స్ ఇప్పుడు ‘పుష్ప ది రైజ్’ కలెక్షన్స్ కి బాగా హెల్ప్ అవుతున్నాయి. 25 రోజులుగా రష్యా థియేటర్స్ లో రన్ అవుతున్న ‘పుష్ప ది రైజ్’ సినిమా ఇప్పటివరకూ 137K అమెరికన్ డాలర్స్ ని రాబట్టింది. ఇది ఆమిర్ ఖాన్ నటించిన ధూమ్ 3, ప్రభాస్ నటించిన బాహుబలి 2 సినిమాల కన్నా ఎక్కువ కావడం విశేషం. రష్యాలో ప్రభాస్, ఆమిర్ ఖాన్ రికార్డులని బ్రేక్ చేసిన ‘పుష్ప ది రైజ్’ మరో 20K డాలర్స్ ని కలెక్ట్ చేస్తే షారుఖ్ ఖాన్ నటించిన ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ సినిమా కలెక్షన్స్ ని కూడా బ్రేక్ చేసినట్లు అవుతుంది. రష్యాలో ‘ఢిల్లీ సఫారి’ అనే సినిమా 854K డాలర్స్ ని రాబట్టి గత పదేళ్లలో అత్యధిక వసూళ్లు సాదించిన భారతీయ చిత్రంగా రష్యాలో టాప్ ప్లేస్ లో ఉంది. 2012 లో రిలీజ్ అయిన ‘ఢిల్లీ సఫారీ’ సినిమాలో ‘గోవింద’ హీరోగా నటించాడు. ‘పుష్ప ది రైజ్’ సినిమాకి ‘ఢిల్లీ సఫారీ’ సినిమాకి మధ్య కలెక్షన్స్ ని చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి టాప్ ప్లేస్ లోకి పుష్ప వెళ్లడం కష్టంగానే కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే పుష్ప ది రైజ్ సినిమా రాబట్టిన కలెక్షన్స్ ని ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే కోటిన్నర వరకూ ఉంటుంది. రష్యాలో ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ పెట్టిన ఖర్చుని కూడా తిరిగి తీసుకోని రాలేదు అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే పుష్ప ది రైజ్ కలెక్షన్స్ ని ఇండియాలో హిట్ అయిన ఎన్నో సినిమాల కన్నా ఎక్కువ అనే విషయాన్ని విమర్శలు చేసే వాళ్లు మర్చిపోతున్నారు. అక్కడ ఇప్పుడిప్పుడే మన సినిమాలకి మార్కెట్ పెరుగుతోంది, అది రాబోఏ రోజుల్లో మరింత పెరిగి మన సినిమాల కలెక్షన్స్ విషయంలో మంచి కాంట్రిబ్యూషణ్ ఇస్తాయి. అప్పటివరకూ ఎంతో కొంత మార్కెట్ ని కొంచెం కొంచెంగా అయినా పెంచుకుంటూ పోవాల్సిందే, అప్పుడే ఇండియన్ సినిమా గ్లోబల్ సినిమా అవుతుంది.