Site icon NTV Telugu

‘పుష్ప’ రన్ టైం కంప్లైంట్… నిర్మాత ఏమంటున్నాడంటే ?

Pushpa

‘పుష్ప’ చిత్రం డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై ప్రేక్షకుల నుంచి విభిన్న స్పందన వచ్చింది. సినిమా చూసిన చాలా మంది చెప్తున్న విషయం ఏమిటంటే సెకండాఫ్ ల్యాగ్ అయ్యిందని, అంతేకాకుండా 3 గంటల సుదీర్ఘ రన్‌ టైమ్ ప్రేక్షకులకు విసుగు తెప్పించిందని అంటున్నారు. అయితే చాలా పెద్ద చిత్రాలకు సాధారణంగా అలాంటి రన్‌టైమ్ ఉంటుంది. అయితే ప్రేక్షకులు చేస్తున్న ఈ కంప్లైంట్ పై నిర్మాతలు ఏమంటున్నారంటే…

Read also : అనారోగ్యంతో ఉన్న అభిమానికి రజనీకాంత్ సర్ప్రైజ్

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేని స్పందిస్తూ రన్‌టైమ్ సమస్యేమీ లేదని వెల్లడించారు. “సాధారణంగా పెద్ద స్టార్లు, పెద్ద దర్శకుల చిత్రాలకు మూడు గంటల రన్‌టైమ్ ఉంటుంది. మన మునుపటి ‘రంగస్థలం’కు కూడా ఇలాంటి రన్‌టైమ్‌ ఉంది. అక్కడక్కడా కొంచెం లాగ్ ఉంటుంది. కానీ కథ అవసరాలకు అనుగుణంగా సన్నివేశాలు ఉండాలంటే ఈ టైం చాలా అవసరం. ప్రేక్షకులు దాని గురించి అస్సలు ఆందోళన చెందరు. మేము డబ్బు వెంటబడితే హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్ థియేటర్‌లలో ఐదవ షోకి తేలికగా ఉండేలా రన్‌టైమ్‌ను తగ్గించి ఉండేవాళ్లం. మూడు గంటల రన్‌టైమ్ కారణంగా వారు కేవలం నాలుగు షోలు మాత్రమే చేసారు. అయినప్పటికీ మేము సులభంగా 50 లక్షల షేర్‌ని పొందగలిగాము” అని సినిమా రన్‌టైమ్ గురించి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక నిర్మాతలు భారీ కలెక్షన్స్‌పై ఆనందం వ్యక్తం చేశారు. చివరికి ఈ చిత్రం మెగా బ్లాక్‌బస్టర్‌గా ముగుస్తుందనే నమ్మకంతో ఉన్నారు.

Exit mobile version