ట్రెండ్‌కు తగ్గట్టుగా భార్యాభర్తల బంధాన్ని వివిధ కోణాల్లో టచ్ చేస్తూ తీస్తున్న చిత్రం ‘పురుష:’. వీరు పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం కాబోతున్న, వులవల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు.
కేవలం పోస్టర్లు, ఫస్ట్ లుక్స్‌తోనే జనాల్లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసిన మేకర్స్.. రీసెంట్‌గా టీజర్‌తో అందరినీ తెగ నవ్వించేశారు.
Also Read: Anil Ravipudi: ఒక్కసారిగా దాడి చేసి వెళ్లిపోతారు.. రాజమౌళిపై అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు!
ఇక తాజాగా ఈ చిత్రంలోని థీమ్ సాంగ్ అన్నట్టుగా.. మగాడి మీద జాలి కలిగేలా, మగాడి పరిస్థితిపై సానుభూతి పెరిగేలా ‘జాలి పడేదెవ్వడు.. మగాడి మీద జాలి పడేదెవ్వడు’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను ఎం. ఎం. కీరవాణి అద్భుతంగా ఆలపించారు. ఇక శ్రవణ్ భరద్వాజ్ ఇచ్చిన క్యాచీ ట్యూన్ శ్రోతల్ని ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. అనంత శ్రీరామ్ లిరిక్స్ అయితే సినిమా కథను వివరించేలా, కథనాన్ని అందరికీ ముందే చెప్పినట్టుగా ఉన్నాయి. ఎంతో ఫన్నీగా సాగిన ఈ లిరిక్స్ భార్యాభర్తల మధ్య బంధాన్ని వివరించాయి.
