NTV Telugu Site icon

MAD Song: ఈ సాంగ్ సింగిల్స్ అందరికీ అంకితం…

Mad Song

Mad Song

కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ చేస్తున్న సినిమా ‘మ్యాడ్’. కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రామ్ నితిన్, నార్నే నితిన్, సంగీత్ శోభన్ లు హీరోలుగా నటిస్తుండగా… గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక, గోపిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీళ్లందరూ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజ్ లో చేసిన అల్లరే ‘మ్యాడ్’ సినిమా కథ. ఇటీవలే బయటకి వచ్చిన ఈ మూవీ టీజర్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకూ అన్ లిమిటెడ్ ఫన్ ని ఇవ్వడంతో మ్యాడ్ టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. కంప్లీట్ రోలర్ క్యాస్టర్ రైడ్ లా ఉన్న ఈ మూవీ టీజర్ యూత్ ని అట్రాక్ట్ చేసింది. శనివారం, ఆదివారం ఎలాగూ సెలవలే కాబట్టి యూత్ థియేటర్స్ కి వస్తారు, అలాంటి వాళ్లని మండే కూడా కాలేజ్ మాన్పించేలా చేస్తే చాలు సినిమా హిట్ కొట్టినట్లే.

ఈ విషయంలో మ్యాడ్ చిత్ర యూనిట్ టీజర్ తోనే మంచి బజ్ ని జనరేట్ చేసారు, దీన్ని మరింత పెంచుతూ మేకర్స్ మ్యాడ్ మూవీ నుంచి ‘ప్రౌడ్ సే సింగల్’ ఫుల్ సాంగ్ ని బయటకి వదిలారు. ప్రోమోతో బజ్ జనరేట్ చేసిన ఈ సాంగ్ కంప్లీట్ గా యూత్ కోసమే రెడీ చేసినట్లు ఉన్నారు. ఇకపై సింగల్స్ కి, మింగిల్ అవ్వాలి అనుకునే వాళ్లకి ఈ ‘ప్రౌడ్ సే సింగల్’ సాంగ్ వినిపిస్తే చాలు ఎవరూ రిలేషన్ లోకి వెళ్లారు. ‘హైదరాబాద్ సికిందరాబాద్ పోరి వెనక పడితే నువ్వు బరాబాద్’ అంటూ రఘురామ్ రాసిన క్యాచీ లిరిక్స్ కి, భీమ్స్ కంపోజ్ చేసిన జోష్ ఫుల్ ట్యూన్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. వినగానే యూత్ అంతా హమ్ చేసుకునేలా ఉన్న ఈ సాంగ్ ని నకాష్, భీమ్స్ కలిసి పాడారు. ఈ ఇద్దరి వోకల్స్ ఉన్న ఎనర్జీ… సాంగ్ ని మరింత ఎంటర్టైనింగ్ గా మార్చింది. “ఛాన్స్ దొరికినా మింగిల్ అవ్వకు… ప్రౌడ్ సింగల్ గా ఉండు మావా” అంటూ సాగిన ఈ సాంగ్ ని ఇకపై యూత్ రిపీట్ మోడ్ లో పాడుకోవడం గ్యారెంటీ.