Site icon NTV Telugu

నిర్మాత తిరుప‌తి రెడ్డి బర్త్ డేన ఆది సాయికుమార్ కొత్త సినిమా ప్రకటన

Adi-Sai-Kumar

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆది సాయి కుమార్‌ హీరోగా తెరకెక్కిన ‘తీస్ మార్ ఖాన్’ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘నాటకం’ ఫేమ్ కళ్యాణ్ జి. గోగణ దర్శకత్వం వహించారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ఆది సాయి కుమార్ సరసన పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తోంది. సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే డిసెంబర్ 25 నిర్మాత నాగం తిరుప‌తి రెడ్డి పుట్టిన రోజు. ఈ సందర్భంగా బర్త్ డే వేడుకను మూవీ ఆఫీసులో ‘తీస్ మార్ ఖాన్’ టీమ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆది సాయి కుమార్, సునీల్‌లతో పాటు యూనిట్ అంతా పాల్గొంది.

ఈ సందర్భంగా విజ‌న్ సినిమాస్ నుంచి మరో మూవీ అనౌన్స్ చేశారు నిర్మాత నాగం తిరుప‌తి రెడ్డి. ‘తీస్ మార్ ఖాన్’ రషెస్, అవుట్‌పుట్ చూసిన నిర్మాత నాగం తిరుప‌తి రెడ్డి ఎంతో ఆనందంతో తిరిగి అదే యూనిట్‌తో మరో సినిమా చేస్తున్నట్లు చెప్పారు. ఈ సినిమాలో ఆది సాయి కుమార్ లీడ్ రోల్ పోషించనుండగా కళ్యాణ్ జి. గోగణ దర్శకత్వం వహించనున్నారు.

https://ntvtelugu.com/pawan-kalyan-encouraging-religious-conversions-says-madhavi-latha/

ఈ సందర్భంగా ఆది సాయి కుమార్ మాట్లాడుతూ.. ”ముందుగా నిర్మాత నాగం తిరుప‌తి రెడ్డి గారికి ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు. నాగం తిరుప‌తి రెడ్డి, కళ్యాణ్ జి గోగణలతో ‘తీస్ మార్ ఖాన్’ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. సెట్స్‌పై ఎంజాయ్ చేస్తూ షూటింగ్ ఫినిష్ చేశాం. దర్శక నిర్మాతలు చాలా సపోర్ట్ చేస్తూ అవుట్‌‌పుట్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా ముందుకెళ్లారు. విజన్ సినిమాస్ ప్రొడక్షన్ నెం 4 రూపంలో మరోసారి అదే టీమ్‌తో కలిసి పని చేయనుండటం ఆనందంగా ఉంది” అని అన్నారు.

దర్శకులు కళ్యాణ్ జి గోగణ మాట్లాడుతూ.. ”’తీస్ మార్ ఖాన్’ సినిమా సెట్స్‌పై ఆది సాయి కుమార్ తన నటనతో అబ్బురపరిచారు. నిర్మాత నాగం తిరుపతి రెడ్డి ఎంతో సపోర్ట్ చేస్తూ ఖర్చు విషయంలో వెనకాడలేదు. ఈ సినిమాను చాలా బాగా తీర్చిదిద్దుతున్నాం. ప్రొడక్షన్ నెం 4తో మరో విలక్షణ కథను మీ ముందుంచుతాం” అని చెప్పారు. సునీల్ మాట్లాడుతూ, ”’తీస్ మార్ ఖాన్’ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. ఈ సినిమా కోసం ఆది సాయి కుమార్ చాలా కష్టపడ్డారు. త్రీ షేడ్స్‌లో ఆయన నటనలోని ఎలివేషన్స్ బయటపడతాయి” అని తెలిపారు.

Exit mobile version