Site icon NTV Telugu

Ram Talluri : తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తా

Ram Talluri

Ram Talluri

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నిర్మాత రామ్ తాళ్ళూరిను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నియమించారు. ఈ మేరకు అధ్యక్షుడు పవన్ ప్రకటన విడుదల చేశారు. “జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా రామ్ తాళ్ళూరిని నియమిస్తున్నాను. పార్టీ సంస్థాగత అభివృద్ధి వ్యవహారాలకు సంబంధించిన బాధ్యతలను ప్రధాన కార్యదర్శి హోదాలో నిర్వర్తిస్తారు. పార్టీ కోసం పని చేస్తానని 2014లోనే ఆయన చెప్పారు. అప్పటి నుంచి ఎటువంటి ఆపేక్ష లేకుండా పార్టీ పట్ల ఎంతో అంకిత భావాన్ని కనబరుస్తూ, అప్పగించిన బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. పార్టీ తెలంగాణ విభాగంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. సాఫ్ట్ వేర్ నిపుణుడైన ఆయన సాఫ్ట్ వేర్ సంస్థల యజమానిగా, తెలుగు సినీ నిర్మాతగా ఉన్నారు.

Also Read:Kodamasimham : చిరంజీవి “కొదమసింహం” రీ రిలీజ్.. ఎప్పుడంటే?

రామ్ తాళ్లూరి ఈ క్రమంలో స్పందించారు. జనసేన పార్టీ ప్రదాన కార్యదర్శిగా నన్ను నియమించిన జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులకు హృదయపూర్వక దన్యవాదాలు.. నాపై మీరు ఉంచిన నమ్మకం నాలో బాధ్యతను, నిబద్ధతను మరింత పెంచాయి. జనసేన పార్టీ పురోగతి కోసం అలుపులేకుండా పనిచేసేలా మీరు నాలో ఉత్సాహం నింపారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడి పనిచేస్తానని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనసైనికులను మరియు నాయకులను కలుపుకుంటూ జనసేన పార్టీ అభ్యున్నతి కోసం పునరంకితమవుతానని వినమ్రంగా తెలియజేస్తున్నాను అని అన్నారు.

Exit mobile version