Producer Rajiv Chilaka Interview for Aa Okkati Adakku: అల్లరి నరేష్ హీరోగా ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జామీ లివర్ కీలక పాత్రలో నైటీనిచ్చింది. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. మే 3న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానున్న నేపథ్యంలో నిర్మాత రాజీవ్ చిలక విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలు పంచుకున్నారు. ఈ క్రమంలో ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాని తెరకెక్కించాడానికి కారణం మంచి కథ కోసం చూస్తున్నపుడు దర్శకుడు మల్లి ఈ కథ చెప్పగా పెళ్లి అనేది అందరూ రిలేట్ చేసుకునే అంశం అనిపించింది అన్నారు.
Mrunal Thakur: సరైన తోడు దొరకడం కష్టమే.. సంచలన నిర్ణయం తీసుకున్న మృణాల్ ఠాకూర్?
ఈ కథలో కామెడీ, ఎంటర్ టైన్మెంట్, ఎమోషన్స్, ఫ్యామిలీ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ జోనర్ సినిమా మా మొదటి సినిమాగా సెట్ అవుతుందని భావించానన్నారు. సినిమాలు నిర్మించాలని దీర్ఘకాలిక ప్రణాళికతో పరిశ్రమలోకి వచ్చానని అన్నారు. సినిమాకి రిలేట్ అయ్యే యానిమేషన్ రంగం చాలా కష్టంతో కూడుకున్నది. ముందు కంపెనీని సుస్థిరం చేసే దిశగా పని చేశాం, కంపెనీ స్థిరపడిన తర్వాత సినిమాల్లోకి రావాలని భావించాం. ఈ క్రమంలో కొంత సమయం పట్టింది. ఇకపై వరుసగా సినిమాలని నిర్మిస్తామని అన్నారు. ఈ కథ విన్నకా అల్లరి నరేష్ గారినే అనుకున్నాం. నిజానికి కథ విన్నాక మొదట మైండ్ లోకి రాజేంద్రప్రసాద్ వచ్చారు, . యంగ్ గా వుంటే ఆయన పర్ఫెక్ట్. ఇప్పుడైతే ఈ కథ నరేష్ కే యాప్ట్, నరేష్ కి కూడా ఈ కథ చాలా నచ్చింది.
మేము కథ చెప్పినపుడు ఆయన రెండు సినిమాలతో బిజీగా ఉన్నా, ఆయన కోసం వెయిట్ చేసి తీశాం. దర్శకుడు మల్లి అంకం చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. దాదాపు ఇరవై ఏళ్ళుగా పరిశ్రమలో ఉన్నారు. అనుకున్న కథని చాలా అద్భుతంగా తీశాడు. నరేష్ హైట్ ఎక్కువ, ఆ ఎత్తుకి చాలా మంది హీరోయిన్స్ సరిపోరు. ఆయన హైట్ ని మ్యాచ్ చేయడానికి ఫరియా అయితే బాగుంటుందనిపించింది. ఫరియా కామెడీ టైమింగ్ కూడా బాగుంటుంది, ఈ కథ నచ్చి ఫరియా ప్రాజెక్ట్ లోకి వచ్చారు. జానీ లీవర్ గారి అమ్మాయి జామీ లివర్ ఇందులో కీలక పాత్రలో కనిపిస్తారు. మురళి శర్మ, వెన్నెల కిషోర్, వైవా హర్ష వీరందరి పాత్రలు వినోదాత్మకంగా ఉంటాయన్నారు. నిర్మాతగా మంచి ఫ్యామిలీ సినిమాలు చేయాలని వుంది, అలాగే ఫాంటసీ, హిస్టారికల్, కామెడీ జోనర్స్ చేయాలని ఉందని అంటూ ఆయన ఇంటర్వ్యూ ముగించారు.