NTV Telugu Site icon

SSMB 28: జనవరి 18న షూటింగ్, ఆగస్ట్ 11న రిలీజ్… శ్రీలీల మెయిన్ హీరోయిన్

Ssmb 28

Ssmb 28

ఘట్టమనేని అభిమానులకి సంక్రాంతి స్పెషల్ గిఫ్ట్ ఇస్తూ ప్రొడ్యూసర్ నాగ వంశీ సూపర్బ్ న్యూస్ చెప్పాడు. మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ‘SSMB 28’ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫాన్స్ కి ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు నాగ వంశీ. ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ని జనవరి 18 నుంచి మొదలుపెట్టనున్నారు. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే, శ్రీలీల ఇద్దరూ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇందులో ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్ అనే నంబర్స్ ఏమీ వేసుకోలేదు. మహేశ్ బాబు పక్కన ఇద్దరు హీరోయిన్స్ అంతే, సోషల్ మీడియాలో శ్రీలీల సెకండ్ హీరోయిన్ అని రాస్తున్నారు అది తప్పు అని నాగ వంశీ క్లారిటీ ఇచ్చేశాడు. SSMB టైటిల్ ఇంకా పెట్టలేదు కానీ ఈ మూవీ రిలీజ్ డేట్ ని మాత్రం ఫిక్స్ అయ్యాం. ఆగస్ట్ 11న SSMB 28 ఆడియన్స్ ముందుకి వస్తుంది అనే కన్ఫాం చేశాడు నాగ వంశీ.

గతంలో జరిగిన షెడ్యూల్ కి సంబంధించిన ఎపిసోడ్స్ సినిమాలో ఉండవు, సినిమా కథ మారింది అనే రూమర్ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఈ విషయంలో కూడా నాగ వంశీ క్లారిటీ ఇచ్చేసి ఉంటే రూమర్స్ స్ప్రెడ్ చేసే వాళ్లకి స్ట్రాంగ్ కౌంటర్ తగిలి ఉండేది. మహేశ్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇప్పటికే ‘అతడు’, ‘ఖలేజ’ సినిమాలు వచ్చాయి కానీ సరైన హిట్ మాత్రం దక్కలేదు. SSMB 28 సినిమాతో ఆ హిట్ లోటుని తీర్చెయ్యాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. మరి మహేశ్, త్రివిక్రమ్ కలిసి హిట్ లోటుని ఏ రేంజులో తీరుస్తారో చూడాలి. ఇదిలా ఉంటే SSMB 28 పాన్ ఇండియా సినిమా అని, థియేట్రికల్ రన్ కంప్లీట్ అవ్వగానే ఒటీటీలో స్ట్రీమ్ అవుతుంది అంటూ నెట్ ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. మురుగదాస్, మహేశ్ బాబు కాంబినేషన్ లో వచ్చిన స్పైడర్ తర్వాత మహేశ్ బాబు సినిమాని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం ఇదే మొదటిసారి.

 

Show comments