సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి ఇప్పటికే ఖలేజ, అతడు సినిమాలు చేశారు. ఈ సినిమాల రిజల్ట్ తేడా కొట్టినా మహేశ్ అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్ కి మాత్రం చాలా మంచి పేరొచ్చింది. అందుకే ఘట్టమనేని ఫాన్స్ అంతా ఈ కాంబోలో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దాదాపు దశాబ్ద కాలంగా వెయిట్ చేస్తున్న ఫాన్స్ కి కిక్ ఇస్తూ ‘SSMB 28’ సినిమాని అనౌన్స్ చేశారు త్రివిక్రమ్, మహేశ్ బాబు. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ జరుపుకున్న ఈ మూవీపై భారి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా ‘SSMB 28’ సినిమా తెరకెక్కిస్తున్నాడు త్రివిక్రమ్. ప్రస్తుతం షెడ్యూల్ బ్రేక్ లో ఉన్న ఈ మూవీపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. సినిమా నెక్స్ట్ షెడ్యూల్ పై క్లారిటీ లేదని, మహేశ్-ప్రొడ్యూసర్స్ ని పిలిచి అప్డేట్ అడిగాడని… నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యే లోపు మూడు రోజుల పాటు ఫారిన్ ట్రిప్ వెళ్తానని మహేశ్ చెప్పినట్లు సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఈ రూమర్స్ విపరీతంగా స్ప్రెడ్ అవ్వడంతో, ప్రొడ్యూసర్ నాగ వంశీ బయటకి వచ్చాడు. తనకి అనిపించిన విషయాన్ని, తను ఫీల్ అయిన దాన్ని, తన సినిమాల గురించి వచ్చే రూమర్స్ ని వెంటనే క్లియర్ చేసే నాగ వంశీ… లేటెస్ట్ గా వస్తున్న రూమర్స్ చూసి “If these gossip mongers can take a hike or make movies like they spread rumours, Industry can benefit. We want #SSMB28 to be a sure-shot Blockbuster and YOU TAKE OUR WORD ON IT. It would be better to let us work at our pace in peace Remember it is Jan 2024 release film! Fans, you loved FL, Just wait and watch on May 31st, what we are upto. THERE IS NO POETRY IN THIS STATEMENT” అంటూ ట్వీట్ చేశాడు. రూమర్స్ స్ప్రెడ్ చేసిన వాళ్లు ముందుకొచ్చి మంచి సినిమాలు చేస్తే, ఇండస్ట్రీకి మంచి చేసిన వారవుతారు అంటూ నాగ వంశీ ట్వీట్ చేశాడు.
‘SSMB 28’తో షూర్ షాట్ బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అంటూ నాగ వంశీ చాలా కాన్ఫిడెంట్ గా మాట ఇచ్చాడు. మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు ఉంది. ఆ రోజు ‘SSMB 28’ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి ప్రాజెక్ట్ పై వస్తున్న రూమర్స్ అన్నింటికీ ఎండ్ కార్డ్ వేస్తారేమో చూడాలి. నిజానికి ‘SSMB 28’ రిలీజ్ ఇప్పట్లో లేదు, వచ్చే జనవరిలో అంటే ఇంకో ఎనిమిదిన్నర నెలల తర్వాత ‘SSMB 28’ రిలీజ్ ఉంటుంది. ఆ లోపు షూటింగ్ పార్ట్ కంప్లీట్ చెయ్యడం పెద్ద విషయమేమీ కాదు కాబట్టి ఫాన్స్ ‘SSMB 28’ డిలే అవుతుంది అనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
If these gossip mongers can take a hike or make movies like they spread rumours, Industry can benefit. We want #SSMB28 to be a sure-shot Blockbuster and YOU TAKE OUR WORD ON IT.
It would be better to let us work at our pace in peace ✌️ Remember it is Jan 2024 release film!…
— Naga Vamsi (@vamsi84) April 27, 2023
