Priyanka Chopra : 1300 గంటలు కష్టపడి చేసిన నెక్లెస్.. ప్రియాంక మెడలో ఎలా ఉందో చూశారా?

Priyanka Chopra

Priyanka Chopra

ఆస్కార్స్ 98వ ఎడిషన్ వేడుకల్లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్ తమ స్టైలిష్ లుక్స్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షించారు, ముఖ్యంగా రెడ్ కార్పెట్‌పై వీరిద్దరూ ధరించిన దుస్తులు, ఆభరణాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. భారతీయ మూలాలను ప్రతిబింబిస్తూ నిక్ జోనాస్ ధరించిన ‘మంగళసూత్ర బ్రేస్‌లెట్’ నెటిజన్ల మనసు గెలుచుకుంది. ఈ ప్రతిష్టాత్మక వేడుక కోసం ప్రియాంక చోప్రా ‘డయోర్’ (Dior) రూపొందించిన వైట్ కస్టమ్ గౌనులో మెరిసిపోయింది, క్లాసిక్ హాలీవుడ్ గ్లామర్‌కు ఆధునిక స్పర్శను జోడిస్తూ ఈ అవుట్‌ఫిట్‌ను డిజైన్ చేశారు స్ట్రాప్‌లెస్ గౌను, ఫిట్టెడ్ కార్సెట్ ప్రియాంక అందాన్ని మరింత ద్విగుణీకృతం చేశాయి. థై-హై స్లిట్ కట్ మరియు గౌను అంచున ఉన్న ఫెదర్ డిటెయిలింగ్ ఈ డ్రెస్స్‌కు హైలైట్‌గా నిలిచాయి. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్‌లో సాఫ్ట్ అండ్ లగ్జరీ ఫీల్‌ను ఇది అందించింది.

Also Read:Salman Khan: సల్మాన్ కొత్త సినిమా టైటిల్ మారింది.. ఏంటో తెలుసా?

ప్రియాంక ధరించిన దుస్తుల కంటే ఆమె ధరించిన నెక్లెస్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘బుల్గారి’ (Bvlgari) బ్రాండ్ అంబాసిడర్‌గా ఆమె ‘ద సర్పెంటి ఇల్యూసియో’ (The Serpenti Illusio) హై జ్యువెలరీ నెక్లెస్‌ను ధరించింది. దీనిని తయారు చేయడానికి ఏకంగా 1300 గంటల సమయం పట్టిందట. ఇందులో 14 క్యారెట్ల యాంటిక్ కుషన్-కట్ మడగాస్కర్ సఫైర్ (నీలమణి) ప్రధాన ఆకర్షణగా ఉంది. పాము ఆకారంలో ఉన్న ఈ నెక్లెస్‌లో డైమండ్స్, ఎమెరాల్డ్స్ మరియు ఒనిక్స్ ఎలిమెంట్స్‌ను అద్భుతంగా పొందుపరిచారు. ప్రియాంక భర్త నిక్ జోనాస్ తన లుక్‌తో భారతీయ అభిమానులను ఫిదా చేశారు. నలుపు రంగు టక్సీడోలో డాషింగ్‌గా కనిపించిన నిక్, తన చేతికి **’మంగళసూత్ర బ్రేస్‌లెట్’** ధరించి కనిపించారు. గతంలో కూడా ఆయన దీనిని ధరించినప్పటికీ, ఆస్కార్ వేదికపై ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతేకాకుండా, ఆయన చేతికి మన సంప్రదాయ **’కలావా’ (రక్షా సూత్రం/కంకణం)** కూడా ఉండటం విశేషం. భారతీయ సంస్కృతి పట్ల ఆయన చూపుతున్న గౌరవానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.