విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఏం చేసినా విలక్షణంగానే ఉంటుంది. తాజాగా ఓ వెరైటీ పని చేశారాయన. పెళ్లి రోజున మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. 56 ఏళ్ల ప్రకాష్ రాజ్ తన భార్య పోనీ వర్మను రెండోసారి వివాహమాడాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. తన ట్విటర్ లో దీనికి సంబంధించిన ఫొటోలు షేర్ చేశాడు. వీటిలో భార్యను ముద్దాడుతున్న ఫొటో తెగ వైరల్ అవుతోంది. అలాగే వారు రింగులు మార్చుకోవటాన్ని కూడా ఇక్కడ చూడొచ్చు.
ప్రకాశ్ రాజ్ ఈ వివాహానికి wedding 2.0 అని పేరు పెట్టాడు. అయితే ఇదంతా తన కొడుకు వేదాంత్ కోసమే చేశానని వివరణ ఇచ్చారు. అమ్మానాన్నలు పెళ్లి చేసుకుంటే చూడాలని వేదాంత్ ఆశపడ్డాడట. మొదటి భార్య లలిత కుమారి ద్వారా ఆయనకు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. వారి పేర్లు మేఘన , పూజ.. ఈ వివాహ వేడుకల్లో వారు కూడా పాల్గొన్నారు.
ఈ ఫొటోలతో పాటు పదకొండేళ్ల క్రితంనాటి తన పెళ్లి ఫొటోని కూడా షేర్ చేశాడాయన. దానికి ఆయన ..మంచి స్నేహితురాలు..మంచి ప్రియురాలు..ఇన్నాళ్లు తోడుగా ప్రయాణించిన నా ప్రియమైన భార్యకు కృతజ్నతలు అంటూ ఓ అందమైన మెసేజ్ జతచేశారు. తెలుగులోనే కాదు .. కన్నడ, హిందీ, తమిళ భాషల్లో నూ ఆయన ప్రముఖ నటుడు. నటుడు మాత్రమే కాదు నిర్మాత దర్శకుడు కూడా. తాజాగా మా ఎన్నికల నేపథ్యంలో ఆయన టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా మారారు.