Site icon NTV Telugu

Punganooru: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏం జరిగిందో తెలుసా!?

Kalasala

Kalasala

Prabhutva Junior Kalasala: యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సినిమాలను తెరకెక్కించడానికి ఆసక్తి చూపుతున్నారు నేటితరం దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే ఓ యదార్థ సంఘటనను తీసుకొని ఎంతో ఆసక్తికరంగా మలిచారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. దీనికి ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా రిలీజ్ కు సిద్దమైన క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టారు.

టీనేజ్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ చిత్రంలో ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. దీనితో సినిమా మీద ఒక్క సారిగా బజ్ పెరిగి పోయింది. ‘తెల్లవారు జామున మంచు పొగలాంటి ప్రేమ అనే వలయంలో చిక్కుకున్న ప్రేమికుల కోసం ఈచిత్రం’ అంటూ గ్లింప్స్ ఆకట్టుకునే విధంగా సాగింది. ఈ మధ్యనే ఈ సినిమా ఆడియో హక్కులను ఫాన్సీ రేటుకు టీ సిరీస్ తెలుగు సంస్థ దక్కించుకుంది. బ్లాక్ ఆంట్ పిక్చర్స్, శ్రీనాథ కథలు సంయుక్తంగా అన్ని హంగులు జోడించి రూపొందించిన ఈ సినిమాకు కొవ్వూరి అరుణ సమర్పకురాలు కాగా భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాతగా వ్యవహరించారు. కార్తీక్ రోడ్రీగుజ్ స్వరాలను అందించగా కమ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించారు. శ్రీ సాయి కిరణ్ లిరిక్స్ రాశారు. నిఖిల్ సురేంద్రన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. అన్ని వర్గాలను అలరించేలా ఈ సినిమా రూపొందించామని, ఈ సినిమాతో ప్రేక్షకులకు ఓ కొత్త ఫీల్ దొరుకుతుందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.

Exit mobile version