Site icon NTV Telugu

Premikudu : ప్రేమికులారా గెట్ రెడీ.. ప్రేమికుడు మళ్ళీ వస్తున్నాడు!

Premikudu Re Release

Premikudu Re Release

Prabhu Deva Starrer Sensational Block Buster Movie Premikudu to Re Release Soon: కేటి కుంజుమోన్ నిర్మాతగా, ఎస్. శంకర్ దర్శకత్వంలో, ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించగా ప్రభుదేవా, నటి నగ్మా నటించిన ప్రేమికుడు సినిమా రీ-రిలీజ్ అవబోతోంది. ఈ సినిమాను ఇప్పుడు రమణ, మురళీధర్ నిర్మాతలుగా రీ రిలీజ్ చేస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రలో నటించగా ఈ సినిమా రీ రిలీజ్ కి సంబంధించిన ప్రెస్ మీట్ నేడు చాలా ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో ముఖ్య అతిథులుగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్, ట్రెజరర్ రామ్ సత్యనారాయణ, దర్శకుడు ముప్పలనేని శివ, శివనాగు నర్రా, శోభారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముప్పలనేని శివ మాట్లాడుతూ 30 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రేమికుడు సినిమా ఇప్పుడు రీ రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది.

Tillu Square: ఉన్నది పాయే .. ఉంచుకున్నది పాయే.. లిల్లీతో ఏందీ లొల్లి.. టిల్లు

అప్పట్లో ప్రభుదేవ ని చూసి స్ప్రింగ్ లు ఏమన్న మింగాడా అనుకునేవాళ్లం. ఒక మంచి ప్రేమ కథ గా సెన్సేషన్ సృష్టించిన సినిమా ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందరితోపాటు ఈ సినిమా కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను అన్నారు. నిర్మాతలు రమణ మురళీధర్ మాట్లాడుతూ 30 సంవత్సరాల క్రితం సెన్సేషన్ సృష్టించిన సినిమా మేము రీ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అతి త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా చేయబోతున్నాం. ఈవెంట్ కి ప్రభుదేవా గారు కూడా హాజరయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నాం, రీ రిలీజ్ లో కూడా కలెక్షన్లు సృష్టిస్తుందని ఆశిస్తున్నామన్నారు.

Exit mobile version