Site icon NTV Telugu

Prabhas: ‘కల్కీ’… ‘జగదేక వీరుడి’ని ఫాలో అవుతున్నాడా?

Prabhas

Prabhas

బాహుబలితో పాన్ ఇండియాను షేక్ చేసిన ప్రభాస్.. ఇప్పుడు ప్రాజెక్ట్ కెతో పాన్ వరల్డ్‌ షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. యంగ్ డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో.. వైజయంతీ బ్యానర్లో దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. అమితాబ్‌ బచ్చన్‌ కీ రోల్ ప్లే చేస్తుండగా.. దీపికా పదుకొనె, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లోక నాయకుడు కమల్ హాసన్ విలన్‌గా నటిస్తున్నాడు. తాజాగా ‘ప్రాజెక్ట్ కే’ ఇదేనంటూ టైటిల్ రివీల్ చేశారు మేకర్స్. అమెరికాలోని శాన్‌ డియాగో కామిక్‌ కాన్‌ ఈవెంట్‌లో ‘ప్రాజెక్ట్ కే’ టైటిల్‌ గ్లింప్స్‌ని విడుదల చేశారు. ‘కల్కి 2898ఏడీ’గా టైటిల్ అనౌన్స్ చేశారు. ఇక కల్కి గ్లింమ్స్ మైండ్‌ బ్లోయింగ్ అనేలా ఉంది. ఇందులో ప్రభాస్ సూపర్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రత్యర్థులను అంతం చేసే వీరుడిగా కనిపిస్తున్నాడు. మొత్తంగా ఈ గ్లింప్స్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మాత్రం గ్లింప్స్‌లో రివీల్ చేయలేదు.

ఎండింగ్‌లో 2898 నుంచి 2024 వరకు అని చూపించారు. కథ ప్రకారం.. అప్పటి కాలానీకి, ప్రస్తుతానికి ముడిపెట్టేలా గ్లింప్స్ ఉన్నప్పటికీ.. రిలీజ్ మాత్రం 2024లో ఉంటుందని మరోసారి క్లారిటీ ఇచ్చారు. కానీ ఇప్పటికే అనౌన్స్ చేసిన జనవరి 12న కల్కి రాబోతుందనే క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ఈ లెక్కన కల్కి పోస్ట్‌పోన్ అయిపోయినట్టే. మరి ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు? అనే డౌట్స్‌కు సోషల్ మీడియాలో ఓ న్యూస్ హల్చల్ చేస్తోంది. వైజయంతి బ్యానర్ కి మే 9వ తేదికి తరాల అనుబంధం ఉంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇండస్ట్రీ హిట్ సినిమా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా తుఫానుకి కూడా ఎదురు నిలిచింది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన మోడరన్ క్లాసిక్ ‘మహానటి’ కూడా మే 9నే రిలీజ్ అయ్యింది. చివరగా మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాతో వైజయంతి మూవీ మే 9న హిట్ కొట్టింది. ఇప్పటివరకూ మే 9న వైజయంతి మూవీస్ నుంచి వచ్చి సినిమాలు నెవర్ బిఫోర్ హిట్స్ గా మారాయి. ఈ సెంటిమెంట్ ని బిలీవ్ చేస్తూ 2024 మే 9న కల్కిని రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని అంటున్నారు. మరి ఈ కల్కి జగదేక వీరుడిని, మహర్షిని, మహానటిని ఫాలో అవుతారో లేదో చూడాలి.

Exit mobile version