Site icon NTV Telugu

Prashanth Neel: ‘సలార్’ అప్డేట్ ఇస్తావా.. చచ్చిపొమ్మంటావా.. ఫ్యాన్ సూసైడ్ లెటర్ వైరల్

Salaar

Salaar

‘కెజిఎఫ్’ చిత్రంతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా తరువాత ప్రశాంత్, ప్రభాస్ తో కలిసి సలార్ ను తెరకెక్కిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సినిమా మొదలైనప్పటినుంచి ఇప్పటివరకు ఒక్క అప్డేట్ ఇచ్చింది లేదు.. ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ కానీ, ఒక గ్లింప్స్ కానీ కనీసం సెట్ లో మేకింగ్ ఫోటో కూడా ప్రశాంత్ రిలీజ్ చేసింది లేదు. దీంతో డార్లింగ్ అభిమానుల కోపం నషాళానికి ఎక్కింది. ఇక ఫ్యాన్స్ వెర్రితనం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇటీవలే ఒక యువకుడు రాధేశ్యామ్ ప్లాప్ టాక్ తెచ్చుకున్నదని సూసైడ్ చేసుకున్న విషయం విదితమే. తాజాగా మరో యువకుడు ‘సలార్’ అప్డేట్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటాను అని ప్రశాంత్ నీల్ కు లెటర్ రాయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. “సినిమా మొదలై ఇన్ని నెలలు అవుతున్నా ఇప్పటివరకు ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ లేదు, ఒక గ్లింప్స్ లేదు.. మే చివరి వారంలోగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కనుక ఇవ్వకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను. ఇలాగే ‘సాహో’ కు చేశారు, ‘రాధేశ్యామ్’ కి చేశారు. ఇప్పుడు ఈ చిత్రానికి అలాగే చేస్తారేమో అని భయమేస్తోంది. ఈసారి అలా జరగకూడదని కోరుకుంటున్నాం. మాకు సలార్ అప్డేట్ కావాలి” అంటూ ఆ సూసైడ్ లెటర్ లో రాసి ఉంది. ప్రస్తుతం ఈ లెటర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ లెటర్ చూసిన పోలీసులు యువకుడి డిటైల్స్ కనుక్కొనే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఈ వైల్డ్ ఫ్యాన్స్ కోరికను ప్రశాంత్ నీల్ తీరుస్తాడా..? లేదా..? అనేది చూడాలి.

Exit mobile version