NTV Telugu Site icon

Kalki 2898 AD Public Talk: కల్కి 2898 AD పబ్లిక్ టాక్.. ఆ సీన్లు ఊహించలేం.. జీవితంలో ఇలాంటి సినిమా చూడలే

Kalki (4)

Kalki (4)

Kalki 2898 AD Public Talk: గత కొంత కాలంగా భారత సినీ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచ సినీ ప్రేక్షకులందరూ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న సినిమా కల్కి నేడు గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది. దీంతో ప్రభాస్ అభిమానులు, సినీ ప్రేక్షకులు అందరూ థియేటర్లకు బారులు తీరుతున్నారు. అయితే కల్కి మొదటి షో టాక్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని కోట్లాదిమంది వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కాగా ఇప్పటికే ఇండియాలో కల్కి మూవీకి సంబంధించిన ప్రీమియర్ షోలు పడిపోయాయి. ఈ క్రమంలోనే పబ్లిక్ టాక్ బయటకు వచ్చేసింది. ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి సినిమా గ్రాండ్గా రిలీజ్ అవ్వగా.. ప్రీమియర్ షో పూర్తయింది.

Read Also:CI Transfer : పవన్ కల్యాణ్ కార్యాలయం లోపలకి అనుమతి లేకుండా వెళ్లేందుకు సీఐ ప్రయత్నం.. బదిలీ వేటు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కల్కి సినిమా ట్రెండింగులో ఉంది. పాన్ ఇండియా హీరో ప్రభాస్.. నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటానీ, కమల్‌ హాసన్‌, శోభన కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ సినిమా.. ప్రీమియర్ షోస్ తోనే ఆ అంచనాలు రీచ్ అయ్యాయన్న టాక్ వచ్చింది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వచ్చిన ఈ సినిమాను మూడు యుగాల నేపథ్యంలో భారీ బడ్జెట్తో రూపొందించారు నాగ్ అశ్విన్. ప్రపంచ వ్యాప్తంగా నేడు ఈ సినిమా ప్రీమియర్స్, బెనిఫిట్ షోస్ పడగా.. ఈ మూవీ చూసిన ప్రేక్షకులు బట్టలు చించుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్‌లో ఉందని పొగిడేస్తున్నారు. ఇలాంటి సినిమా ఇండియా సినీ చరిత్రలో ఫస్ట్ టైం వచ్చిందంటూ ప్రభాస్ ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు. ఇది డార్లింగ్ పెట్టిన ఫుల్ మీల్స్ అంటున్నారు. ఈ మూవీతో ప్రభాస్ రేంజ్ మరో లెవెల్‌కి వెళ్లిపోతుందంటూ హడావుడి చేస్తున్నారు.

Read Also:Train Upper Berth: రైలులో ఎగువ బెర్త్ పడిపోవడంతో ప్రయాణికుడి మృతి..లేదు సీటు బాగానే ఉందన్న రైల్వే

విజువల్ ఎఫెక్ట్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని ప్రభాస్, అమితాబ్ నటన క్లైమాక్స్ సీన్స్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తాయంటూ తెగ పొగిడేస్తున్నారు. అయితే ఫస్ట్ ఆఫ్ లో కొన్ని సీన్లు స్లోగా అనిపించాయని.. అయినా అవి సినిమా పై ప్రభావం చూపబోవని చెబుతున్నారు. పురాణాలు, ఇతిహాసాల ఆధారంగా నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా మలిచారని, విష్ణుమూర్తి పదో అవతారంగా భావించే ‘కల్కి’ అవతారాన్ని ఈ సినిమాలో బాగా చూపించారని మెచ్చుకుంటున్నారు. ప్రభాస్ క్యారెక్టర్ అయితే ఊహాతీతం అంటున్నారు. తొలి 15 నిమిషాలు అస్సలు మిస్ కావొద్దని సూచిస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఆఖరి 30 నిముషాలు మాత్రం ఊహకే అందదని గూస్ బంప్స్ గ్యారంటీ అంటున్నారు. ఈ సినిమాతో ప్రభాస్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల ఊచకోత తప్పదంటున్నారు. ప్రీమియర్స్ తోనే ఈ రేంజ్ లో టాక్ రావడం ప్రభాస్ అభిమానులకు కిక్కిస్తోంది.