Site icon NTV Telugu

Adipurush: మూడు రోజుల్లో 340 కోట్లు… ట్రేడ్ వర్గాలకి కూడా షాక్

Adipurush

Adipurush

భారీ ఏమో ఆకాశాన్ని తాకే రేంజ్… టాక్ ఏమో యావరేజ్… ఈ టాక్ తో ఆదిపురుష్ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ దాటుతుందా అనే అనుమానం ఒక పక్క, ప్రభాస్ ఒక పక్క నిలబడితే… ఆడియన్స్ ప్రభాస్ వైపే నిలబడ్డారు. టాక్ యావరేజ్ అయితే ఏంటి కలెక్షన్స్ మాత్రం పీక్స్ లోనే ఇస్తాం అంటూ ఆడియన్స్ థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. మొదటి రోజు వంద కోట్లు కలెక్ట్ చెయ్యడమే చాలా మంది స్టార్ హీరోలకి ఒక డ్రీమ్ అయితే ప్రభాస్ ఫస్ట్ డే, సెకండ్ డే కాదు థర్డ్ డే కూడా వంద కోట్ల కలెక్షన్స్ ని రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ట్రేడ్ వర్గాలకి కూడా షాక్ ఇచ్చే రేంజులో మూడు రోజు ఆదిపురుష్ సినిమా రెండో రోజు కన్నా ఎక్కువ రాబట్టడం విశేషం. డే 1 140 కోట్లు రాబట్టిన ఆదిపురుష్ సినిమా ఓవరాల్ గా ఫస్ట్ 3 డేస్ కంప్లీట్ అయ్యే సరికి 340 కోట్లు కలెక్ట్ చేసింది.

ప్రొడ్యూసర్స్ ఆదిపురుష్ కలెక్షన్స్ ని అఫీషియల్ గా రిలీజ్ చేసారు. మూడో రోజు కూడా వంద కోట్లు రాబట్టిన అతి తక్కువ సినిమాల్లో ఒకటిగా ఆదిపురుష్ నిలిచింది. ఈ సినిమాతో ప్రభాస్ తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసాడు. మండే బుకింగ్స్ కూడా బాగున్నాయి కాబట్టి ఇదే బుకింగ్స్ ట్రెండ్ ని మూడు రోజులు మైంటైన్ చేస్తే చాలు, మళ్లీ వీకెండ్ వచ్చేస్తుంది, ఆదిపురుష్ జోష్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ వీక్ ఎండ్ అయ్యే టైంకి ఆదిపురుష్ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ ని రీచ్ అవ్వడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు ప్రెడిక్ట్ చేస్తున్నాయి. ఒక యావరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాకే ఇలా ఉంటే సెప్టెంబర్ 28న రిలీజ్ కానున్న సలార్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సృష్టించబోయే సెన్సేషన్ ని ఊహించడం కూడా కష్టమే.

Exit mobile version