Site icon NTV Telugu

Ponniyin Selvan-2: పోనీలే ఇప్పటికైనా చోళులు వస్తున్నారు…

Ps 2

Ps 2

చోళులు వస్తున్నారు అంటూ మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా ఆడియన్స్ ముందుకి తెచ్చాడు. 500 కోట్లు కలెక్ట్ చేసిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమా సక్సస్ తమిళ ప్రజలకి మాత్రమే పరిమితం అయ్యింది. పొన్నియిన్ సెల్వన్ 1 ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ బాగానే చేశారు కానీ సినిమా మొత్తం తమిళ వాసన ఉండడంతో ఇతర ప్రాంతాల ఆడియన్స్ పొన్నియిన్ సెల్వన్ 1 సినిమాని రిజెక్ట్ చేశారు. పార్ట్ 2ని కూడా ఇలానే రిజెక్ట్ చేస్తారు అనుకున్నారో లేక తమిళ కథ తమిళ ఆడియన్స్ కోసం మాత్రమే ప్రమోషన్స్ చేస్తే చాలు అనుకున్నారో ఏమో కానీ ఇప్పటివరకూ పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ప్రమోషన్స్ కి ఇతర ప్రాంతాల్లో చెయ్యలేదు. ఒక పాన్ ఇండియా సినిమా మరో పదిహేను రోజుల్లో రిలీజ్ ఉంది అంటే బజ్ అసలు ఒక రేంజులో ఉండాలి కానీ పొన్నియిన్ సెల్వన్ 2 విషయంలో అసలు బజ్ అనేదే లేదు. తమిళనాడులోనే సోసోగా పబ్లిసిటీ చేశారు, ఇక తెలుగు రాష్ట్రాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సరేలే ఒక ఈవెంట్ చేసేస్తే అయిపోతుందని మేకర్స్ భావించినట్లు ఉన్నారు పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ రానున్నారు, అది కూడా ఒక్క ఈవెంట్ కోసం మాత్రమే. ఇంత వీక్ ప్రమోషన్స్ తో తెలుగులో పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాకి వీక్ ఓపెనింగ్స్ రావడం అయితే పక్కా, కనీసం కొన్న వాళ్లకి అయినా రిటర్న్స్ వస్తాయో లేదో చూడాలి. చోళులు తిరిగి వస్తున్నారు అంటూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. పొన్నియిన్ సెల్వన్ 2 ప్రమోషన్ రూట్, మ్యాప్ ని ఈ వీడియోలో రివీల్ చేశారు. మరి ఈ టూర్ తో అయినా పొన్నియిన్ సెల్వన్ 2 ప్రమోషన్స్ లో జోష్ వస్తుందేమో చూడాలి.

Exit mobile version