Polimera Fame Sai Kamakshi Bhaskarla Interview: సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల హీరో హారోయిన్‌గా.. గెటప్ శ్రీను, రాకేందు మౌళి, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం మా ఊరి పొలి మేర-2. గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రానికి డా.అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. మా ఊరి పొలిమేర చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రం నవంబరు 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ప్రముఖ పంపిణీదారుడు వంశీకృష్ణ నందిపాటి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర విశేషాలను హీరోయిన్ డా. కామాక్షి భాస్కర్ల మీడియాకు తెలియజేశారు.
ముందుగా సినిమా గురించి ఏం చెబుతారు?
‘మా ఊరి పొలిమేర’ పార్ట్ 1 చూడకపోతే వెంటనే హాట్ స్టార్‌లో చూడండి, ఎందుకంటే మొదటి పార్ట్ ఓటీటీలో చూసిన వారంతా.. రేపు నవంబర్ 3న థియేటర్లలో విడుదల కాబోతోన్న ‘మా ఊరి పొలిమేర 2’ని చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ పార్ట్ 2లో ప్రొడక్షన్ వేల్యూస్ చాలా ఉన్నంతగా ఉంటాయి, అలాగే క్యాస్టింగ్ కూడా ఎక్కువగా కనిపిస్తారు. ఇది సీక్వెల్ అనగానే కొంతమందికి డౌట్స్ ఉన్నాయి. ‘F2’, ‘F3’ లాగా వేరువేరుగా ఉంటుందని అనుకుంటున్నారు. అలాంటిదేమీ లేదు. పార్ట్ ఎక్కడ అయితే ఎండ్ అయిందో.. అక్కడ నుండి పార్ట్ 2 మొదలవుతుంది, పార్ట్ 1లో లాస్ట్ 20 మినిట్స్ అందరికీ బాగా నచ్చాయనేలా మాట్లాడుకున్నారు కానీ పార్ట్ 2 మొత్తం అలాంటి టాకే వినిపిస్తుంది. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి థ్రిల్ చేస్తూ ఈ సినిమా ముందుకెళ్తుంది అన్నారు కామాక్షి.
ఫస్ట్ పార్ట్ ఓటీటీలో, రెండో పార్ట్ థియేటర్స్‌లో విడుదల కదా.. ఎలా అనిపిస్తుంది?
నేను ఇందులో నటిగా చేస్తూనే అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ చేశాను. డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు నేను కూడా ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల చేస్తే బాగుంటుంది అని, అటువంటి కంటెంట్ ఇందులో ఉందని చెబితే.. అనిల్ గారు అంతగా తెలిసిన ఫేస్‌లో ఇందులో లేవు. రిస్క్ ఎందుకు? పార్ట్ 1 రిజల్ట్‌ని చూసుకుని పార్ట్ 2ని థియేటర్స్‌లో రిలీజ్ చేద్దామని ముందే అనుకున్నాం.
ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?
మొదటి పార్ట్‌లో చాలా ఓర్పుగా ఉండే పాత్ర చేశాను. అయితే నా పాత్రకు అందులో అన్ని రకాల ఎమోషన్స్ పండించే స్కోప్ ఇచ్చారు, ఇందులో ఇంకాస్త అగ్రెసివ్‌గా కనిపిస్తాను. నా పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది.
మొదటి పార్ట్‌లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లాగా ఇందులో అలాగే ఏమైనా ప్లాన్ చేశారా?
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది కానీ కావాలని ఏదో పెట్టారు అని కాకుండా ప్రతి సీన్‌కు ప్రాధాన్యత ఉంటుంది, అది చివరి వరకు సినిమా చూస్తేనే తెలుస్తుంది. ప్రతి పాత్రకు ఇందులో ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ పాత్ర లేకపోయినా పర్లేదు అని ఎక్కడా అనిపించదు. మంచి స్క్రీన్‌ప్లే బేస్డ్ మూవీ ఇది. సినిమా చూసి బయటకు వెళ్లే వాళ్లంతా లక్ష్మీ పాత్రను బయటకు తీసుకెళతారు, అలా అందరికీ కనెక్ట్ అవుతుంది ఇందులో నా పాత్ర.
అంటే పార్ట్ 1 చూస్తేనే పార్ట్ 2 అర్థం అవుతుందా? కొత్తగా చూసేవారికి కూడా సినిమా కనెక్ట్ అవుతుందా?
పార్ట్ 1 చూసినా, చూడకపోయినా.. పార్ట్ 2 అందరికీ కనెక్ట్ అవుతుంది, అలా అనిల్ సార్ ఈ సినిమాను డిజైన్ చేశారు. పార్ట్ 1 మొత్తాన్ని ఓ 4 మినిట్స్‌లో పార్ట్ 2 స్టార్టింగ్‌లో రీకాప్ పెట్టాం. కాబట్టి ఆ ప్రాబ్లం ఏమీ ఉండదు, ఈ పార్ట్ చూస్తే దాదాపు రెండు పార్ట్‌లు చూసిన ఫీలే కలుగుతుంది, పార్ట్ 2 ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి పార్ట్ 1ని ఓటీటీలో చూసే వారి సంఖ్య బాగా పెరిగిందని రిపోర్ట్స్ వచ్చాయి, అంటే జనాలు ఈ పార్ట్ 2 చూడాలని ఎంతో ఇంట్రస్ట్‌గా ఉన్నారు.
మీ జర్నీ గురించి చెప్పండి?
నేను ఈ మధ్య అందరికీ తెలిసి ఉండవచ్చు. ‘విరూపాక్ష, సైతాన్, పొలిమేర 1 అండ్ 2’ వరుసగా వచ్చేయడంతో స్క్రీన్‌పై అతి తక్కువగా కనిపించినట్లుగా అనిపిస్తుంది కానీ 2018 మిస్ ఇండియా నుంచి నా జర్నీ మొదలైంది మెడిసిన్ పక్కన పెట్టి సినిమాల కోసం ప్రొడక్షన్ హౌస్‌ల చుట్టూ తిరిగా. ఈ సినిమా తర్వాత పేరు వస్తే.. నేను ఏమేం చేశానో అంతా వెనక్కి వెళ్లి చూస్తారు, అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రౌడీ బాయ్స్, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ వంటి సినిమాల్లో నటిస్తూనే ఉన్నా, గుర్తింపు లేకపోవడం వల్ల ఎవరికీ తెలియలేదు. ఈ ఇయర్ హిట్స్ పడటంతో అంతా నన్ను గుర్తు పెట్టుకుంటున్నారు, ‘ఆహా’లో ఇప్పటికి 3 వెబ్ సిరీస్‌లు చేశా, ఈజీగా ఏం రాలేదు.. ఇదంతా 5 ఇయర్స్‌కు నేను పెట్టిన ఎఫర్ట్‌కు దక్కిన గుర్తింపు.
డాక్టర్ యాక్టర్ అయిన మీరు బ్లాక్ మ్యాజిక్‌ను నమ్ముతారా?
నాకు వాటిపై ఎలాంటి అభిప్రాయం లేదు, డాక్టర్‌గానే కాదు ఒక మనిషిగా ఇవేమీ పట్టించుకోను. ఎవరైనా నమ్ముతాను అంటే నా జుట్టు తీసుకుని చేసి చూపించండి, అప్పుడు నమ్ముతాను అనే టైపులాంటి పర్సన్‌ని నేను, బ్లాక్ మ్యాజిక్‌ను నేను నమ్మను.
డాక్టర్ నుంచి యాక్టర్‌గా మారారు.. డైరెక్షన్ కూడా అంటున్నారు.. మీకు ఇంట్రెస్టా?
చాలామంది కలలు కన్నా, ఇలా అవ్వాలనుకున్నాను అని చెబుతుంటారు. కానీ నేను యాక్టర్‌ని డైరెక్టర్‌ని కావాలని అనుకోలేదు. సైన్స్ అండ్ ఆర్ట్స్ అంటే నాకు ఇష్టం. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నాను. ఆర్ట్స్‌లో భాగంగా కొన్ని థియేట్రికల్ ఆర్ట్స్ చేయడం జరిగింది. అప్పుడు నేను ఇంకో పర్సన్‌లా కూడా చేయగలననే థాట్‌తో యాక్టింగ్‌లోకి వచ్చా, నాకు రైటింగ్ చాలా ఇష్టం. చలంగారి ప్రమేయం నాపై ఎక్కువగా ఉంటుంది. పొలిమేర 1 టైమ్‌లో అనిల్ గారికి అదే చెప్పాను. ఒక యాక్టర్‌గానే కాకుండా అన్ని క్రాఫ్ట్స్‌పై అవగాహన పెంచుకోవాలని అనుకుంటున్నానని చెప్పా అది తెలిస్తే.. సినిమాపై నాకు ఇంకా గౌరవం పెరుగుతుంది. అందుకే డైరెక్షన్‌లో డిపార్ట్‌మెంట్‌లో కూడా భాగమయ్యాను. ఒక క్రాఫ్ట్‌లో వర్క్ చేసే వారు, వేరే క్రాఫ్ట్‌లో ఉన్నవారిని కొంచెం తక్కువగా చూస్తుంటారు. ఇది ఇండస్ట్రీలో చూశాను. నాకు ఆ పొగరు రాకూడదనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నా, ఈ మూవీకి కూడా నేను డైలాగ్స్ రాశా, స్క్రిప్ట్ విషయంలో కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యాను.
ఇకపై కూడా దీనిని కంటిన్యూ చేస్తారా?
ఖచ్చితంగా చేస్తాను. నాకు ఆ కెపాసిటీ ఉందని నమ్ముతున్నాను. ఫీమేల్ డైరెక్టర్స్ చాలా తక్కువగా ఉన్నారు. ఫ్యూచర్‌లో డైరెక్షన్ కూడా చేయవచ్చు.
మీ ఫ్యామిలీకి సినిమాతో ఏమైనా సంబంధం ఉందా?
ఉంది.. మా నాన్నగారు డిఓపి, ఆయన ఇండస్ట్రీలో కొన్ని సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా, సెకండ్ యూనిట్ కెమెరామెన్‌గా చేశారు. అలా అని నాకు ఏదో బ్యాక్ సపోర్ట్ ఉంది అనుకోవద్దు. ఇక్కడ ప్రతి ఒక్కటి నాకు నేనుగా కష్టపడి క్రియేట్ చేసుకుంది, కల్పనా రాయ్, రంభ వంటి వారు మాకు బంధువులు. అన్ని విభాగాల్లో మా ఫ్యామిలీకి రిలేటెడ్ అయిన వాళ్ళు ఉన్నారు కానీ.. నేను ఏ ఒక్కరి సాయం తీసుకోలేదు, కొన్ని అవమానాలు ఫేస్ చేశా కానీ చాలెంజింగ్‌గా తీసుకున్నాను.
ఇతర ఆర్టిస్ట్‌లతో మీ బాండింగ్ ఎలా ఉంటుంది?
నాకు ఒక్కసారి సీన్ చెబితే ఎదురు ఎలాంటి ఆర్టిస్ట్ ఉన్నా, నా సీన్ పర్ఫెక్ట్‌గా చేశానా లేదా? అనే చూస్తా, నా సీన్ పూర్తవ్వగానే మళ్లీ రెడీ అయిపోయి ఇతర క్రాఫ్ట్‌కు సంబంధించిన పని చూసుకుంటా. ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరితో నాకు సీన్లు ఉన్నాయి, ఎవరితోనూ డిస్ కంఫర్ట్ ఫీలవ్వలేదు, ఈ సినిమా సెట్స్‌లో నాకు చాలా మంచి స్పేస్ దొరికింది.
మీకు ఇన్‌స్పిరేషన్ ఎవరు? అంటే ఏం చెబుతారు?
నేను కె. విశ్వనాధ్‌గారి సినిమాలు ఎక్కువగా చూస్తాను. బుక్స్ ఎక్కువగా చదువుతాను. ఆ బుక్స్ రాసిన వారందరినీ అలాగే ఫీలవుతాను. కానీ వాళ్లని నేను చూడలేదు. నాకు తెలిసి మా అమ్మే నాకు ఇన్‌స్పిరేషన్. తను నాకోసం చాలా చేసింది. ఇద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ఈ సినిమాకు తన కో ప్రొడ్యూసర్‌గా కూడా చేశారు.
గీతా ఆర్ట్స్‌లో రిలీజ్ గురించి..
వాళ్లకి ఈ సినిమా చూడగానే బాగా నచ్చేసింది. వారు విడుదల చేయడంతో సినిమా బాగా జనాల్లోకి వెళ్లిపోయింది. ఏం ఛేంజ్ చేయవద్దు. ఎలా ఉన్నదాన్ని అలా రిలీజ్ చేద్దాం అన్నారు. మేమంతా చాలా హ్యాపీగా ఫీలయ్యాం. ఇప్పుడున్న పరిస్థితిలో ఇలాంటి పుష్ దొరకడంతో మేం చాలా హ్యాపీ.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్..?
మాన్షన్ హౌస్ మల్లేష్, ధూత వంటి సినిమాలలో చేస్తున్నాను. ‘మా ఊరి పొలిమేర 2’ విడుదల కోసం ఎంతగానో వేచి చూస్తున్నాను.