దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ నిర్మిస్తున్న “” పోలీస్ వారి హెచ్చరిక “” సినిమా టైటిల్ లోగోను డైరెక్టర్ తేజ మంగళవారం రోజున ఆయన కార్యాలయం లో ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా దర్శకుడు తేజ మాట్లాడుతూ ఏ సినిమాకైనా ప్రేక్షకులను ఆకర్షించేది , వారిని థియేటర్ ల వద్దకు నడిచేలా చేసేది టైటిల్ మాత్రమే అని అన్నారు. ఈ “” పోలీస్ వారి హెచ్చరిక”” అనే టైటిల్ కూడా అలాంటి శక్తివంతమైన మాస్ టైటిల్ అని, ఈ టైటిల్ దర్శక నిర్మాతలకు కొంగు బంగారంగా మారి విజయాన్ని చేకూరుస్తుందని అన్నారు.
ఇక నిర్మాత బెల్లి జనార్థన్ మాట్లాడుతూ విజయాలను సెంటిమెంట్ గా మలుచుకున్న సక్సెస్ ఫుల్ దర్శకుడు తేజ చేతుల మీదుగా మా సినిమా పబ్లిసిటీ నీ ప్రారంభించడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని , దీనిని ఒక శుభసూచిక గా మేము భావిస్తున్నామని పేర్కొన్నారు. దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ సినిమా షూటింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని అద్భుతమైన లొకేషన్ లలో పూర్తి చేశామని , ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని …” తెలిపారు.
