Police Notice To Actor Chikkanna in Renukaswamy Murder Case: రేణుకా స్వామి హత్య కేసులో తక్షణం తమ ఎదుట హాజరుకావాలని కన్నడ సినీ నటుడు చిక్కన్నకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెంగళూరు వెస్ట్ డివిజన్ పోలీసులు సోమవారం ఉదయం నోటీసు జారీ చేసి వెంటనే పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాలని చిక్కన్నని ఆదేశించారు. జూన్ 8న రేణుకాస్వామిపై దాడి చేసి హత్య చేయడానికి ముందు, నటుడు దర్శన్ తన సన్నిహితుడు, నిందితుడు వినయ్‌కు చెందిన స్టోనీ బ్రూక్ హోటల్‌లో పార్టీ చేసుకున్నాడు. ఆ పార్టీలో నటుడు చిక్కన్న కూడా పాల్గొన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పార్టీ సమయంలో దర్శన్ మరియు అతని స్నేహితులు రేణుకా స్వామి గురించి మాట్లాడారా? తదుపరి ప్లాన్ గురించి చెప్పారా? అనే అంశం మీద పోలీసులు విచారించాల్సి ఉందని అంటున్నారు.
Darshan: కరెంట్ షాకిచ్చి, శాకాహారయినా ఎముకలు నోట్లో కుక్కి రేణుకా స్వామికి టార్చర్
అయితే నటుడు చిక్కన్న హత్య లేదా పార్టీలో ఉన్న వారి గురించి సమాచారం ఇస్తే, అతన్ని సాక్షిగా పరిగణిస్తారు. ఇకపై అరెస్టులు ఉండవని పోలీసు వర్గాలు తెలిపాయి. కొన్ని నెలల క్రితం, బెంగళూరులోని జెట్ లాగ్ పబ్‌లో అర్థరాత్రి వరకు పార్టీ చేసుకున్నందుకు నటుడు దర్శన్ మరియు కటేరా చిత్ర బృందంపై కేసు నమోదైంది. ఈ సందర్భంగా నటుడు చిక్కన్న కూడా విచారణ నిమిత్తం సుబ్రహ్మణ్య పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఇప్పుడు చిక్కన్న దర్శన్ విషయంలో మళ్లీ పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పటికే నటుడు చిక్కన్న ఇంటికి ఫోన్, సిబ్బంది ద్వారా నోటీసులు పంపారు. వెంటనే హాజరు కావాలని పోలీసులు సూచించడంతో సోమవారం సాయంత్రం లేదా రాత్రి చిక్కన్న పోలీస్ స్టేషన్‌కు హాజరుకానున్నారు. కామాక్షి పాళ్య పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని చిక్కన్నను పోలీసులు ఆదేశించారు. ప్రస్తుతం అన్నపూర్ణేశ్వరి పోలీస్ స్టేషన్‌లో నటుడు దర్శన్‌ని విచారిస్తున్నారు. దీంతో ఈ ఇద్దరు నటులు కలుసుకుని మాట్లాడుకునే అవకాశం లేదు. ఇక దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి 8 రోజులు కావస్తున్నా అతని కుటుంబ సభ్యులు ఎవరూ పోలీస్ స్టేషన్‌కు రాక పోవడం గమనార్హం.