NTV Telugu Site icon

Shanmukh Jaswanth Case: గంజాయితో పట్టుబడ్డ షణ్ముఖ్, అన్నపై రేప్ కేసు… అసలు కథ ఇదే!

Shanmukh Jaswanth Case

Shanmukh Jaswanth Case

Police Clarity on Shanmukh Jaswanth Ganja Case: బిగ్ బాస్ ఫేం షణ్ముఖ్ జస్వంత్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. షార్ట్ ఫిల్మ్స్ లో అవకాశం ఇప్పిస్తానని వైజాగ్ కి చెందిన డాక్టర్ యువతితో స్నేహం చేసిన షణ్ముఖ్ ఆమెను తన అన్న సంపత్ వినయ్ కి పరిచయం చేశాడు. వారిద్దరి మధ్య ప్రేమ పుట్టగా పదేళ్లుగా ప్రేమలో ఉండి ఇంట్లో ఒప్పించి పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. మూడేళ్ల క్రితం ఇరు కుటుంబాల సమక్షంలో వైజాగ్ లో ఎంగేజ్మెంట్ జరుగగా యువతి తల్లికి అనారోగ్యం కారణంగా పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. ఈనెల 28న ఇద్దరి పెళ్లి ప్రయత్నాలు జరుగుతుండగా సంపత్ వేరే యువతిని పెళ్లి చేసుకున్నట్లు యువతికి షణ్ముఖ్ తండ్రి అప్పారావు సమాచారం ఇవ్వడంతో నార్సింగ్ పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది.

Music Director Radhan: రథన్ చెన్నైలో ఉండి బతికిపోయాడు..డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

ఇక ఆమె ఫిర్యాదుతో సంపత్ వినయ్ ఫ్లాట్ కి వెళ్ళిన పోలీసులు అక్కడ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు గురించి నార్సింగ్ ఏసిపి రమణ గౌడ్ మాట్లాడుతూ పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి శారీరకంగా వాడుకుని మోసం చేశాడని ఒక యువతి సంపత్ వినయ్ అనే యువకుడిపై ఫిర్యాదు చేసిందని, యువతి ఫిర్యాదు మేరకు సంపత్ వినయ్ ఫ్లాట్ కి వెళ్ళామని అన్నారు. అక్కడ సంపత్ తమ్ముడు, బిగ్ బాస్ ఫేం షణ్ముక్ ఉన్నాడు, అప్పుడే ఫ్లాట్ లో కొన్ని మత్తు పదార్థాలు దొరికాయని అన్నారు. యువతి ఫిర్యాదు మేరకు సంపత్ పై రేప్, చీటింగ్ కేసు నమోదు చేశాం, అయితే 16 గ్రాముల మత్తు పదార్థాలు కూడా దొరికాయి కాబట్టి NDPS కేసు కూడా పెట్టామని అన్నారు. ఇక ఈ కేసులో షణ్ముఖ్ ప్రమేయం పై విచారణ జరుపుతున్నామని అన్నారు. ఇక షణ్ముక్ అన్న వినయ్ సంపత్ ను నార్సింగ్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు పోలీసులు.

Show comments