భారతదేశంలో సినిమాలంటే, సినీ నటీనటులంటే దేవుళ్లు అన్న స్థాయిలో అభిమానులు ఉంటారు. అలాంటప్పుడు వారు చేసే ప్రతి చర్య పై కోట్లాది మంది కళ్లుంటాయి. అందుకే సెలబ్రిటీలు ఎప్పుడు జాగ్రత్తగా ప్రవర్తించాలి. అయితే కొందరు స్టార్‌లు ఆ హద్దులు దాటిపోతూ వివాదాల్లో చిక్కుకుంటారు. తాజాగా భోజ్‌పురి ఇండస్ట్రీకి చెందిన సూపర్‌స్టార్ పవన్ సింగ్ ఒక ఈవెంట్‌లో హీరోయిన్‌తో సరసాలు ఆడుతూ కెమెరాల్లో చిక్కుకోవడంతో మళ్లీ వివాదాలు మొదలయ్యాయి. స్టేజ్‌పైనే జరిగిన ఈ సన్నివేశం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో ‘కోట్ల మంది చూస్తున్నారనే బుద్ధి ఉండక్కర్లేదా’’ అంటూ ఆగ్రహం వ్యాక్తం చేస్తున్నారు. నటులు, ప్రముఖులు జాగ్రత్తగా ప్రవర్తించాలి అని సోషల్ మీడియాలో నెటిజన్లు వాపోతున్నారు.
Also Read : Ghati : సెన్సార్ ముగించుకున్న ‘ఘాటి’.. ఇంటర్వెల్ తర్వాత ఊచకోతేనా! .
ఇక భోజ్‌పురి పవర్‌స్టార్‌గా పేరొందిన పవన్ సింగ్ తొలుత సింగర్‌గా కెరీర్ ప్రారంభించారు. తర్వాత ‘ప్రతిజ్ఞా’, ‘సత్య’, ‘క్రాక్ ఫైటర్’,‘హర్ హర్ గంగే’ వంటి సినిమాలతో ఫుల్ మాస్ క్రేజ్ దక్కించుకున్నారు. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ స్త్రీ 2లో ‘ఆయే నై’ అనే సాంగ్‌తో పవన్ సింగ్ నేషనల్ లెవెల్‌లో పాపులర్ అయ్యారు. అయితే వ్యక్తిగతంగా పవన్ సింగ్ పేరు గతంలో కూడా పలు వివాదాల్లో వినిపించింది. ఏడేళ్ల క్రితం ఓ రిసార్ట్‌లో హీరోయిన్‌పై దాడి చేసిన ఘటన పెద్ద చర్చనీయాంశమైంది. అంతేకాకుండా వ్యక్తిగత జీవితంలోనూ రెండు పెళ్లిళ్లతో పాటు అనేక రూమర్స్‌తో ఆయన పేరు మీడియాలో హాట్‌టాపిక్ అయ్యింది. ఇక ఇప్పుడు మరో సారి స్టేజ్‌పై జరిగిన ఈ కొత్త ఘటనతో మళ్లీ ఆయన ప్రవర్తన పై మండి పడుతున్నారు.
