Site icon NTV Telugu

Pawan kalayan : పవన్ కళ్యాణ్ – లోకేష్ కాంబినేషన్ ఫిక్స్..!

Pawan Kalyan Lokesh

Pawan Kalyan Lokesh

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ త్వరలోనే పాన్ ఇండియా డైరెక్టర్‌తో జతకడుతున్నారనే వార్త మీడియాలో సంచలనం రేపుతుంది. ఈ సినిమాను తమిళ ఇండస్ట్రీలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నదని..ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే సదరు సంస్థ అధికారికంగా ప్రకటించడానికి రెడీ అవుతుంది టాక్. మని ఇంతకి  ఈ సినిమాకు దర్శకుడు ఎవరు? ఆ నిర్మాణ సంస్థ ఏంటీ అనే వివరాల్లోకి వెళితే..

Also Read : Varun-Tej : కొత్త లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వరుణ్ తేజ్..!

రాజకీయంలో తన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తూనే పవన్ కల్యాణ్ సినిమాలపై కూడా దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఓజీ సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం సుమారుగా రూ. 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి పవన్ కెరీర్ లో ఊహించని హిట్ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతోపాటు మరో మూవీని కూడా పట్టాలేక్కించే పనిలో ఉన్నారట పవన్ కల్యాణ్. తమిళంలో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ కేవీఎన్ సంస్థ లో.. ఈ సినిమా ను పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ సంపాదించుకొన్న లోకేష్ కనకరాజ్ గానీ.. లేదా వినోద్ గానీ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయట. ఈ మేరకు చర్చలు పూర్తయ్యాయని.. త్వరలోనే సెన్సేషనల్ న్యూస్ అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.

కేవీఎన్ ప్రొడక్షన్స్ విషయానికి వస్తే.. దక్షిణాదిలో అగ్ర నటులతో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తోంది. ప్రస్తుతం దళపతి విజయ్‌తో జన నాయకన్, యష్‌తో టాక్సిక్, చిరంజీవితో బాబీ దర్శకత్వంలో ఓ సినిమా, ధ్రువ సర్జా హీరోగా కేడీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్‌తో ఓ సినిమాను నిర్మించేందుకు నిర్ణయం తీసుకొన్నారు అని తెలుస్తున్నది.

Exit mobile version