Pawan Kalyan First instagram post: కొన్నాళ్ల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న సంగతి తెలిసిందే. నిజానికి చాలా కాలం నుంచి ఫేస్బుక్ పేజ్ తో పాటు ట్విట్టర్ కూడా మెయింటైన్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇంస్టాగ్రామ్ లోకి మాత్రం ఈ మధ్యనే ఇచ్చారు. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్క పోస్టు కూడా పెట్టకపోయినా రికార్డ్ స్థాయిలో ఆయన అకౌంటును చాలా మంది ఫాలో అయ్యారు. అది క్రియేట్ చేసిన రోజుల వ్యవధిలోనే 2 మిలియన్ అంటే ఇరవై లక్షల మంది ఆ అకౌంటును ఫాలో అవుతున్నారు. ఇక తాజాగా ఆయన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుంచి మొట్టమొదటి పోస్టుగా ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది. ఆ వీడియోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనేక మంది స్టార్ హీరోలతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే ఈ వీడియోలో తన మాజీ భార్య రేణు దేశాయ్ ఫోటో కూడా ఆయన షేర్ చేశాడు. ఆ ఫోటోలను షేర్ చేసుకుంటూ ఇవన్నీ ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలని సినీ పరిశ్రమలో భాగమై ఎంతో మంది ప్రతిభావంతులతో నిరాడంబరమైన వ్యక్తులతో కలిసి ప్రయాణిస్తున్నందుకు తాను కృతజ్ఞుడిని అని చెబుతూ దాదాపుగా రెండు నిమిషాల 35 సెకండ్ల నిడివి గల వీడియోని ఆయన షేర్ చేసుకున్నారు.
Vaishnavi Chaitanya: ప్రాణం పెట్టి చేశా.. కొంచెం మీటర్ తప్పినా ఇక అంతే!
ఇక ఆ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అమితాబచ్చన్, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, సూపర్ స్టార్ కృష్ణ , గోపీచంద్, వరుణ్ తేజ్, మంచు మనోజ్, శ్రీకాంత్ మేక, పంజా వైష్ణవ్ తేజ్, నాని, దిల్ రాజు, రానా, ప్రకాష్ రాజ్, విశ్వక్సేన్, ఆది సాయి కుమార్, సునీల్, హీరో విజయ్, విక్రమ్, కార్తీ, రవితేజ, ఎస్జె సూర్య, సాయిధరమ్ తేజ్, సంపూర్ణేష్ బాబు , శర్వానంద్, నందమూరి హరికృష్ణ, కిచ్చా సుదీప్ వంటి హీరోలతో దిగిన ఫోటోలు షేర్ చేశారు. అంతేకాదు అల్లు రామలింగయ్య, దాసరి నారాయణరావు, ఏఆర్ రెహమాన్, బొమన్ ఇరానీ, కుష్బూ, ఎస్ఎస్ రాజమౌళి, వేణుమాధవ్, సాయి మాధవ్ బుర్ర, కే విశ్వనాథ్, సమంత, ఇలియానా, మణిశర్మ, బోనీకపూర్, రామానాయుడు, సురేష్ బాబు, నిర్మాత పొట్లూరి వరప్రసాద్, కమెడియన్ శ్రీనివాసరెడ్డి, ఎమ్మెస్ నారాయణ, అసిన్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, ఎలమంచిలి రవి, కిషోర్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, శృతిహాసన్, దేవి శ్రీ ప్రసాద్, నిర్మాత చినబాబు, జానీ మాస్టర్, గద్దర్, ఎస్పీ బాలసుబ్రమణ్యం, డైరెక్టర్ సాగర్ చంద్ర, రామ జోగయ్య శాస్త్రి, కరుణాకరన్, కమెడియన్ సప్తగిరి, క్రిష్ జాగర్లమూడి, బండ్ల గణేష్, బ్రహ్మానందం, తమన్ వంటి వారి మాత్రమే కాకుండా ఇంకా చాలామంది ఉన్నారని చెబుతూ మన బంధం ఇలాగే కొనసాగాలని, మరెన్నో మధురమైన జ్ఞాపకాలని పంచుకోవాలని ఆశిస్తున్నాను అంటూ వీడియో క్లోజ్ చేశారు.
అయితే ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత సరికొత్త చర్చలు తెరమీదకు వస్తున్నాయి. ఎందుకంటే 2024 ఎన్నికల మీద పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్ గత కొద్ది కాలంగా వారాహి యాత్ర చేపట్టారు. తన స్పీచ్ లలో ఆయా ప్రాంతాల్లో పుట్టి పెరిగిన హీరోలను ప్రస్తావిస్తూ వారి ఫ్యాన్స్ను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. మనం పరిశీలిస్తే నరసాపురం, మొగల్తూరు వంటి ప్రాంతాలకు సంబంధించిన పర్యటన సమయంలో ఎక్కువగా ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి పేర్లను ప్రస్తావిస్తూ వారి అభిమానుల్లో మంచి క్రేజ్ అయితే సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకపక్క రాజకీయంగా రాటు తేలుతున్న పవన్ కళ్యాణ్ స్పీచ్ లతోనే కాకుండా తన వ్యూహాలకు కూడా పదును పెడుతున్నాడని ఇలా ఇతర హీరోలతో ఉన్న అనుబంధాలు షేర్ చేసుకుంటున్నాడని అంటున్నారు.
అలా చేయడం వల్ల ఆయా హీరోల అభిమానులు పవన్ వైపు రాజకీయంగా మొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఇంస్టాగ్రామ్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆయన తన పొలిటికల్ అజెండా కోసమే దీని లాంచ్ చేశారని అందుకే హీరోగా ఉన్న ఫోటోలు కాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గా ఉన్న ఫోటోని ఆయన డిస్ప్లే పిక్చర్ గా పెట్టుకున్నారని చర్చ జరిగింది. కానీ ఇక్కడ మాత్రం అసలు ఏమాత్రం పొలిటికల్ టచ్ లేకుండా కేవలం ఇతర హీరోలతో తనకున్న అనుబంధాన్ని, దర్శక నిర్మాతలు, కమెడియన్లు అలాగే ఇతర భాషలకు చెందిన హీరోలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఒక వీడియో పోస్ట్ చేయడం వెనుక పవన్ వ్యూహం ఉందని అంటున్నారు. ముఖ్యంగా అందరూ హీరోల చేత ఫాలోయింగ్ పెంచుకోవడం అలాగే ఆ ఫాలోయింగ్ ఓట్లుగా మలుచుకునే ప్రయత్నంలోనే ఈ మేరకు ఒక వీడియో రిలీజ్ చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి.