Site icon NTV Telugu

Bheemla Nayak: యానాంకు పవన్‌ ఫ్యాన్స్‌ క్యూ..

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు సినిమాను తొందరగా చూడాలన్న ఆతృతతో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.. ఆంధ్రప్రదేశ్ లో బెనిఫిట్‌ షోలకు అవకాశం లేకపోవడంతో… సమీప ప్రాంతాలకు తరలివెళ్లి సినిమా చూస్తున్నారు.. బెనిఫిట్ షోలు వేయకుండా సినిమా హాళ్ల యాజమాన్యాలను ముందుగానే హెచ్చరించారు రెవెన్యూ అధికారులు. జీవో నంబర్‌ 35 ప్రకారమున్న ధరలనే వర్తింప చేయాలని నోటీసులు జారీ చేశారు.. కొన్ని ప్రాంతాల్లో థియేటర్ల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు రెవెన్యూ అధికారులు. దీంతో.. విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో నిన్న ఆందోళనలు నిర్వహించారు పవన్‌ కల్యాణ్‌ అభిమానులు.. ఉదయం నుంచే థియేటర్ల వద్ద సందడి చేసినా.. బెనిఫిట్‌ షోలు లేకపోవడంతో నిరాశకు గురయ్యారు..

Read Also: Tirumala: సామాన్య భక్తులకు టీటీడీ శుభవార్త

మరోవైపు.. తూర్పు గోదావరి జిల్లాలోని పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ యానాం బాట పట్టారు.. యానాంలో ఉదయం 5 గంటల నుంచి భీమ్లా నాయక్ బెనిఫిట్ షోలు వేస్తున్నారు.. యానాంలో రెండు థియేటర్లలో ప్రత్యేక షోలకు పుదుచ్ఛేరి అధికారులు అనుమతి ఇచ్చారు.. దీంతో.. తూర్పుగోదావరి నుంచి ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలు యానాం వెళ్లారు.. ఇక, ఇదే అదునుగా భావించిన థియేటర్ల యాజమాన్యాలు.. ఒక్క టికెట్‌ 500 రూపాయలకు అమ్మినట్టుగా తెలుస్తోంది.. యానాంలోని థియేటర్లలలో మాత్రమే బెనిఫిట్స్ షో వేయడంతో భీమ్లా నాయక్ సినిమా చూసేందుకు పెద్ద సంఖ్యల్లో పవన్‌ ఫ్యాన్స్‌ తరలివెళ్లడంతో.. ఫ్యాన్స్ వాహనాలు, కార్లతో యానాం కిక్కిరిసిపోయింది.

Exit mobile version