NTV Telugu Site icon

Pawan Kalyan: అసలు ఎందుకు ట్రెండ్ చేస్తున్నారు మావా… మీ దెబ్బకి సోషల్ మీడియా షేక్ అవుతోంది

They Call Him Og Pawan Kalyan

They Call Him Og Pawan Kalyan

సలార్ రిలీజ్ ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఈరోజు కలెక్షన్స్ రిపోర్ట్ బయటకి వచ్చే వరకూ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. దేవర టీజర్ బయటకి రాబోతుంది అనే న్యూస్ వినిపిస్తుండడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలర్ట్ అయ్యారు. దేవర ట్యాగ్ ని ట్రెండ్ చేస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. గుంటూరు కారం సినిమా మరో రెండు వారాల్లో రిలీజ్ అవుతోంది కాబట్టి ఘట్టమనేని అభిమానులు కూడా సోషల్ మీడియాని కబ్జా చేసి రచ్చ చేస్తున్నారు. వచ్చే నెల రోజుల పాటు సోషల్ మీడియా అంతా ఘట్టమనేని అభిమానుల హంగామాతో నిండిపోతుంది. ఇలా ప్రతి హీరో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడానికి ఒక సాలిడ్ రీజన్ ఉంది, తమ హీరో సినిమా అప్డేట్ బయటకి వస్తేనే, వస్తుందనే న్యూస్ వస్తేనే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కారణం లేకున్నా పవన్ పేరుని ట్రెండ్ చేస్తున్నారు.

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ‘దే కాల్ హిమ్ OG’ ట్యాగ్ ని టాప్ ట్రెండ్ చేస్తున్నారు. సలార్ సినిమాలో సూపర్బ్ రోల్ ప్లే చేసిన శ్రీయా రెడ్డి OG మీ ఊహకందకుండా ఉంటుంది అనే మాట చెప్పిన దగ్గర నుంచి… సలార్ సినిమాకే ఇలా ఉంటే మా OG వస్తే గ్రౌండ్ లెవల్లో సెలబ్రేషన్స్ ఏ రేంజులో ఉంటాయో మీ ఊహకే వదిలేస్తున్నాం అంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. కారణం లేకున్నా పవన్ కళ్యాణ్ పేరుని, OG ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్న ఫ్యాన్స్… ఇక సినిమా రిలీజ్ సమయానికి వస్తే ఆన్ లైన్ ఆన్ లైన్ అనే తేడా లేకుండా రిలీజ్ సెలబ్రేషన్స్ కి కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

Show comments