Site icon NTV Telugu

గెట్ రెడీ… ‘బంగార్రాజు’ నుంచి ఊర మాస్ సాంగ్ వచ్చేస్తోంది

అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు అక్కినేని నాగచైతన్య కలిసి నటిస్తున్న మూవీ ‘బంగార్రాజు’. 2016లో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకు ఈ మూవీ సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. చైతూ బర్త్ డే సందర్భంగా ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్‌లో చిన్న బంగార్రాజుగా నాగచైతన్య అదరగొట్టాడు. తాజాగా ఈ సినిమాలో పార్టీ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. ఈ పాట ఊర మాస్ సాంగ్ అని తెలుస్తోంది. పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా సినిమా యూనిట్ పాటను పేర్కొంది. ఈ నెల 17న ఈ పాట టీజర్‌ను విడుదల చేయనున్నట్టు బంగార్రాజు టీమ్ ప్రకటించింది. కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

Read Also: మెగాస్టార్ ‘ఆచార్య’కు పోటీగా సూర్య సినిమా

మరోవైపు తండ్రి నాగార్జునతో కలిసి నాగ చైతన్య నటిస్తున్న మూడో సినిమా ఇది. తొలిసారి వీళ్లిద్దరూ కలిసి ‘మనం’ సినిమాలో నటించారు. ఆ తర్వాత మరోసారి ‘ప్రేమమ్’లో నటించారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను అందుకున్నాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి తండ్రీకొడుకులు వెండితెరను షేర్ చేసుకుంటున్నారు. ‘బంగార్రాజు’ సినిమాలో యంగ్ నాగార్జున పాత్రలో ఆయన తనయుడు నాగచైతన్య నటిస్తున్నట్లు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే అర్ధమవుతోంది.

Exit mobile version