బాలీవుడ్ క్వీన్, ప్రస్తుతం హాలీవుడ్ లో ప్రాజెక్ట్స్ చేస్తూ ఇంటర్నేషనల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా మేనకోడలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది పరిణీతి చోప్రా. ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇండియాస్ టాప్ 100 సెలబ్రిటీస్ లిస్టులో 2013 నుంచి చోటు దక్కించుకున్న పరిణీతి చోప్రా, బాలీవుడ్ లోకి ‘లేడీస్ Vs రిక్కీ భల్’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి డెబ్యు సినిమా అంటే ఆ హీరోయిన్ కెరీర్ సెట్ అయిపోయినట్లే. అయితే పరిణీతి చోప్రా కెరీర్ ఇంత ఈజీగా సాగలేదు. మంచి ఫ్యామిలీ బ్యాక్ గ్రాండ్ ఉన్నా, యష్ రాజ్ ఫిలిమ్స్ ;లాంటి బ్యానర్ బ్యాక్ అప్ ఇచ్చినా సెలక్టివ్ సినిమాలు మాత్రమే చేస్తూ ఉండడంతో పరిణీతి చోప్రా సిని కెరీర్ సో సో గానే సాగుతుంది. హీరోయిన్స్ మాములుగానే ఏడాదికి ఆరేడు సినిమాలు చేస్తూ ఉంటారు కానీ గడిచిన ఆరేళ్లలో పరిణీతి చోప్రా నటించింది కేవలం 11 సినిమాలే అంటే ఆమె సెలక్టివ్ గా సినిమాలు చేస్తుందో లేక అవకాశాలు రావట్లేదు అనే టాక్ బాలీవుడ్ లో ఉంది. ‘ఇషాక్ జాదే’ సినిమాకి గాను స్పెషల్ మేన్షన్ కేటగిరిలో నేషనల్ అవార్డు గెలుచుకున్న పరిణీతి చోప్రా లేటెస్ట్ గా ‘ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా’తో కలిసి కనిపిస్తోంది.
ఈ ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారు అని బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురించింది కానీ పరిణీతి, రాఘవ్ లు మాత్రం ఈ రూమర్స్ కి రెస్పాండ్ అవ్వలేదు. నో చెప్పకుండా ఇద్దరూ ‘జస్ట్ ఫ్రెండ్స్’ అనడం, కొన్నిసార్లు డేటింగ్ రూమర్స్ ని సైలెంట్ గా స్కిప్ చేసి వెళ్ళిపోవడం ఈ ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారు అని చెప్పడానికి మరింత బలమైన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇటివలే గూర్గావ్ లోని ‘వెస్టిన్ హోటల్’లో పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా డిన్నర్ కి వెళ్లారు. ఈ సంధర్భంగా కొన్ని ఫోటోలు లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జస్ట్ ఫ్రెండ్స్ అంటున్నారు ఎప్పుడు చూసినా కలిసే తిరుగుతున్నారు. ఈ ఇద్దరూ జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే కాదు అని నేషనల్ మీడియా చెప్తోంది. మరి ఈ డేటింగ్ రూమర్స్ లో నిజముందో లేదో తెలియాలి అంటే ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వాలి.
