Site icon NTV Telugu

Disney+Hotstar: ‘పరంపర’ సీజన్ 1 వెజ్ థాలీ.. సీజన్ 2 నాన్ వెజ్ మీల్స్

Parampara Season2

Parampara Season2

Parampara Season 2 Will Give NonVeg Treat Says Akanksha Singh: డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో ‘పరంపర’ వెబ్ సీరిస్ కు చక్కని స్పందన రావడంతో దాని సీజన్ 2 నూ రెడీ చేశారు దర్శక నిర్మాతలు. ఇందులో జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సీరిస్ 21వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు.

దర్శకుడు అరిగెల విశ్వనాథ్ మాట్లాడుతూ, ”’పరంపర 2′ లో మరింత యాక్షన్, డ్రామాను చూస్తారు. గోపీ పాత్రలో నవీన్ చంద్ర పర్మార్మెన్స్ ఆకట్టుకుంటుంది. నిజ జీవితంలో గోపీ లక్షణాలు ఏమాత్రం లేని వ్యక్తి నవీన్ చంద్ర. అతనితో పనిచేయడం సంతోషంగా ఉంది. నవీన్ చంద్ర క్యారెక్టర్ మాత్రమే కాదు శరత్ కుమార్, జగపతిబాబు, రవివర్మ, ఆకాంక్ష సింగ్, దివి .. ఇలా అందరి క్యారెక్టర్స్ ఆకట్టుకుంటాయి. ఆర్కా మీడియాకు ‘బాహుబలి 2’ ఎంత పెద్ద సక్సెస్ ఇచ్చిందో, ‘పరంపర 2’ కూడా అంతే పెద్ద సక్సెస్ అవ్వాలి” అని అన్నారు.

హీరోయిన్ ఆకాంక్ష సింగ్ మాట్లాడుతూ, ”రచన అనే పాత్రలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. తెలుగులో నేను నటించిన చిత్రాలు కొన్నే. అయినా నాపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చినందుకు ఆర్కా మీడియాకు థాంక్స్. నా పాత్ర గురించి చెప్పినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. చాలా ఎమోషన్స్, వేరియేషన్స్ ఉన్న పాత్ర నాది. నటించకుండా నేనే రచన అనుకుని భావిస్తూ ఈ పాత్రను పోషించాను. ‘పరంపర 2′ అంటే గోపీ, రచన మాత్రమే కాదు. ఇంకా చాలా ఉంది, వెబ్ సిరీస్ లో చూసి ఎంజాయ్ చేయండి” అని చెప్పింది. హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ, ”’పరంపర 1’ వెజ్ థాలి అయితే, ‘పరంపర 2’ నాన్ వెజ్ మీల్స్. మరింత డ్రామా, యాక్షన్, రివేంజ్ చూస్తారు. సీజన్ 2 స్ట్రీమింగ్ కు కొద్ది రోజులే ఉంది. కాబట్టి మొదటీ సీజన్ చూసేయండి, అప్పుడు మీకు సెకండ్ సీజన్ క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే ఫస్ట్ సీజన్ లో మీరు ఏ అంశాలైతే మిస్ అయ్యాయి అనిపించాయో, వాటికి సీజన్ 2 లో సమాధానం దొరుకుతుంది” అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి, రవివర్మ కూడా పాల్గొని తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.

Exit mobile version