Site icon NTV Telugu

Disney plus hotstar: ‘పరంపర-2’ వెబ్ సీరిస్ కు విశేష ఆదరణ!

Parampara 2

Parampara 2

‘Parampara-2’ web series is very popular!

డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో లేటెస్ట్ సెన్సేషన్ అవుతోంది ‘పరంపర 2’ వెబ్ సిరీస్. ఈ నెల 21న స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ వెబ్ సిరీస్ ఓటీటీ లవర్స్, క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ‘కథను ఎమోషనల్ గా డ్రైవ్ చేయడంలో దర్శకులు ఎల్. కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ సక్సెస్ అయ్యారని నిర్మాతలుగా శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని తెలిపారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘పరంపర 2’ వెబ్ సిరీస్ కు ఇప్పటిదాకా 250 మిలియన్ మినిట్స్ వ్యూస్ రావడం ఒక రికార్డ్ గా చెబుతున్నారు. మూడు జెనరేషన్స్ కి సంబంధించిన కథతో రూపొందిన ‘పరంపర 2’, మొదటి సీజన్ సక్సెస్ ను మరో మెట్టుకు తీసుకెళ్లింది. ఈ సెకండ్ సీజన్ లోని స్ట్రాంగ్ ఎమోషన్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయని, పది సినిమాలకు కావాల్సినంత స్టఫ్ ఈ వెబ్ సిరీస్ లో ఉందని తాము చెప్పిన మాటలు నిజమయ్యాయని నిర్మాతలు అన్నారు.

Exit mobile version