NTV Telugu Site icon

Panchayat season 3: పంచాయత్ సీజన్ 3 స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఆరోజు నుంచే!

Panchayat Season 3

Panchayat Season 3

Panchayat season 3 streaming date is out: పంచాయత్ సీజన్ 3 త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రైమ్ వీడియో స్పెషల్ గా వచ్చే పంచాయత్ సీజన్ 3 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక జనవరి 15 నుండి పంచాయత్ 3 స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందని అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది. ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోలో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న మొదటి రెండు సీజన్లను ఉచిత స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంచారు. మొదటి రెండు సీజన్లు అందించిన సహజమైన, చక్కని వినోదంతో అభిమానులు, వీక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. డిసెంబర్ 9న ‘పంచాయతీ 3’ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అభిషేక్ త్రిపాఠి పేరుతో జితేంద్ర కుమార్ తన బైక్‌పై ఉన్నట్టు ఆ లుక్ రిలీజ్ చేశారు. . పంచాయ‌త్ సీజ‌న్ 1, సీజ‌న్ 2 స‌క్సెస్‌గా నిల‌వ‌డంతో సీజ‌న్ 3పై కూడా ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి.

Tiger 3 : త్వరలో ఓటీటీ స్ట్రీమింగ్ కు రానున్న టైగర్ 3. అధికారికంగా ప్రకటించిన అమెజాన్ ప్రైమ్ వీడియో..

అభిషేక్ త్రిపాఠి అనే ఇంజినీరింగ్ చ‌దువుకున్న యువ‌కుడికి క్యాంప‌స్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం రాక పోటీ పరీక్షలు రాస్తూ పంచాయ‌తీ సెక్ర‌ట‌రీ ఉద్యోగంలో చేరుతాడు. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని ఫులేరా అనే గ్రామంలో అడుగుపెట్టిన అభిషేక్‌కు అక్క‌డ ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి? భిన్న మ‌న‌స్త‌త్వాలు క‌లిగిన గ్రామ‌స్తుల మ‌ధ్య ఇమ‌డ‌లేక అభిషేక్ ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి ద‌ర్శ‌కుడు దీప‌క్ కుమార్ మిశ్రా కామెడీని పండించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇక అందుకే ఇండియాలోనే అత్య‌ధిక మంది వీక్షించిన వెబ్‌సిరీస్‌ల‌లో ఒక‌టిగా పంచాయ‌త్ సీజ‌న్ 1, సీజ‌న్ 2 నిలవగా సీజ‌న్ 3 కూడా ఎనిమిది ఎపిసోడ్స్‌తో తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు ద‌ర్శ‌కుడు దీప‌క్ కుమార్ మిశ్రా గతంలోనే ప్ర‌క‌టించాడు. అందులో భాగంగా ఈ సిరీస్ మూడో సీజన్ 15 నుంచి స్ట్రీమ్ కానుంది. పంచాయ‌త్ వెబ్ సిరీస్‌లో అభిషేక్ త్రిపాఠితో పాటు నీనా గుప్తా, ర‌ఘుబీర్ యాద‌వ్‌, ఫైస‌ల్ మాలిక్ కీల‌క పాత్ర‌లు పోషిస్తోన్న సంగతి తెలిసిందే..